World Bank: పెట్టుబడులకు భారత్ అనువైన దేశం: ప్రపంచ బ్యాంకు

by S Gopi |

స్వల్పకాలానికి వృద్ధిలో హెచ్చుతగ్గులపై ఆందోళనలను తోసిపుచ్చారు.

World Bank: పెట్టుబడులకు భారత్ అనువైన దేశం: ప్రపంచ బ్యాంకు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిపై ప్రపంచ బ్యాంకు అత్యంత విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. అస్సాంలోని గౌహతిలో జరుగుతున్న అడ్వాంటేజ్ అస్సాం 2.0 బిజినెస్ సమ్మిట్‌లో బుధవారం పాల్గొన్న ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అగస్టె టానో కామే మాట్లాడుతూ.. స్వల్పకాలానికి వృద్ధిలో హెచ్చుతగ్గులపై ఆందోళనలను తోసిపుచ్చారు. భారత్ 'షైనింగ్ లైట్ ఇన్ ది వరల్డ్' గా అభివర్ణించిన ఆయన, భారత వృద్ధిని ఉపయోగించుకోవాలని ప్రపంచ పెట్టుబడిదారులను కోరారు. ఇటీవల మన ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నిధులను వెనక్కి తీసుకెళ్లడం, బలహీన వినియోగం, వృద్ధి నెమ్మదించడం వంటి డేటా విషయంలో ఎవరైనా ఆందోళన చెందుతుంటే, కంగారు పడకండి. భారత్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది సరైన సందర్భం. భారత్ పెట్టుబడులకు అత్యంత అనువైన దేశమని అగస్టె కామె వివరించారు. ఆర్థిక వృద్ధిలో ఒక శాతం మేర పాయింట్లలో హెచ్చుతగ్గులు ప్రపంచ బ్యాంక్ సానుకూల దృక్పథాన్ని మార్చవని ఆయన స్పష్టం చేశారు.

Next Story