- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nirmala Sitharaman: త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: ఆర్థిక మంత్రి సీతారామన్
మనం సాధిస్తున్న వృద్ధి అందరినీ కలుపుకుని సాగుతున్నది. అందుకే దేశంలో 2.5 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగాము

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందని, త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం జరిగిన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (డీఎస్ఈ)లో డైమండ్ జూబ్లీ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. భారత్ చాలా భిన్నమైన అంశాల ఆధారంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మనం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి అందరినీ కలుపుకుని సాగుతున్నది. అందుకే దేశంలో 2.5 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగాము. ఇది మనందరి సహకారమని తెలిపారు. 2014లో పదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ స్థానం నుంచి ఐదవ, నాల్గవ స్థానానికి, త్వరలో 2027–28 నాటికి మూడవ స్థానానికి చేరేందుకు వేగంగా వృద్ధి సాధిస్తున్నది. ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉన్న భారత్, రాబోయే కొన్నేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లను దాటి జపాన్, జర్మనీలను అధిగమిస్తుంది. భారత్ స్వాతంత్ర్యం సాధించి 100వ సంవత్సరం చేరే 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని అంచనా వేస్తున్నాం. పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు, కృత్రిమ మేధ(ఏఐ) వంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు తయారీ, డిజిటల్ సేవలు, మౌలిక సదుపాయాలలో పనితీరు ద్వారా ఈ వృద్ధి సాధ్యమవుతుందని నిర్మలా సీతారమన్ పేర్కొన్నారు.






