Services PMI: 11 నెలల గరిష్టానికి సేవల రంగ వృద్ధి

by S Gopi |

గడిచిన నాలుగేళ్లుగా సేవల రంగం సానుకూలంగానే కొనసాగుతోంది.

Services PMI: 11 నెలల గరిష్టానికి సేవల రంగ వృద్ధి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ సేవా రంగ కార్యకలాపాలు పుంజుకున్నాయి. ప్రస్తుత ఏడాది జూలై నెలకు సంబంధించి ఈ రంగ వృద్ధి 11 నెలల గరిష్ఠానికి చేరింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ వ్యాపార కార్యకలాపాల సూచీ(పీఎంఐ) జూలైలో 60.5 పాయింట్లకు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ డిమాండ్ బలంగా ఉండటం, దేశీయంగా అమ్మకాలు కొనసాగడం వల్ల ఈ వృద్ధి నమోదైందని పీఎంఐ సూచీ వెల్లడించింది. సాధారణంగా 50 పాయింట్ల కంటే ఎక్కువ పీఎంఐ నమోదైతే కార్యకలాపాల వృద్ధి సానుకూలంగా, తక్కువ నమోదైతే క్షీణతగా పరిగణిస్తారు. గత నెలలో దీనికి మించి వృద్ధి నమోదైంది. గడిచిన నాలుగేళ్లుగా సేవల రంగం సానుకూలంగానే కొనసాగుతోంది. కొత్త వ్యాపారాల నుంచి ఆర్డర్లు రావడం, అంతర్జాతీయ వ్యాపారాలు బలంగా పెరగడం, సానుకూల డిమాండ్ ధోరణి, విక్రయాలు పెరగడం వంటి అంశాలు సేవల రంగం వృద్ధికి దోహదపడుతున్నాయి. సేవలకు సంబంధించి కొత్త ఆర్డర్లు, వ్యాపార కార్యకలాపాలు రెండింటిలోనూ ఫైనాన్స్, బీమా సంస్థలు ఎక్కువగా వినియోగించి అగ్రగామిగా నిలిచాయి. రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు వృద్ధి నెమ్మదించాయని గణాంకాలు పేర్కొన్నాయి. సేవల గిరాకీ బలంగా ఉన్నప్పటికీ ఉద్యోగాల సృష్టి 15 నెలల కనిష్టానికి చేరింది.

Next Story