IPOs: 2025లో ఐపీవోల ద్వారా నిధులు సేకరించిన నాలుగో అతిపెద్ద దేశంగా భారత్

by S Gopi |

2025లో భారత స్టాక్ మార్కెట్లు ఐపీఓల ద్వారా మొత్తం 14.2 బిలియన్ డాలర్ల(రూ. 1.26 లక్షల కోట్ల) నిధులను సమీకరించాయి.

IPOs: 2025లో ఐపీవోల ద్వారా నిధులు సేకరించిన నాలుగో అతిపెద్ద దేశంగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాదికి సంబంధించి పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా అత్యధికంగా నిధులను సేకరించిన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానం దక్కించుకుంది. ప్రముఖ రీసెర్చ్, బ్రోకరేజ్ కంపెనీ బెర్న్‌స్టెయిన్ ప్రకారం, 2025లో భారత స్టాక్ మార్కెట్లు ఐపీఓల ద్వారా మొత్తం 14.2 బిలియన్ డాలర్ల(రూ. 1.26 లక్షల కోట్ల) నిధులను సమీకరించాయి. ఈ జాబితాలో అమెరికా 52.9 బిలియన్ డాలర్ల(రూ. 4.7 లక్షల కోట్ల)తో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వత హాంకాంగ్(రూ. 2.07 లక్షల కోట్లు), చైనా(రూ. 1.44 లక్షల కోట్లు), తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు దేశీయంగా మొత్తం 74 కంపెనీలు రూ. 85,241.08 కోట్ల విలువైన నిధులను సమీకరించాయి. ఈ ఏడాదిలో అతిపెద్ద ఐపీఓలుగా ఉన్న టాటా క్యాపిటల్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, వీవర్క్ ఇండియాలు త్వరలో ప్రారంభించే ఐపీఓలో మరో రూ. 30,000 కోట్లను సేకరించనున్నాయి. ఈ ఏడాది ఐపీఓల నిధుల సేకరణ విలువ గత ఐదేళ్లలోనే మరో అత్యధిక మొత్తం అని బెర్న్‌స్టయిన్ నివేదిక తెలిపింది. డేటా ప్రకారం, ఐదేళ్లలో అత్యధికంగా 2024లో మొత్తం 91 ఐపీఓలు స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టగా, అవి రూ. 1,59,783.76 కోట్లు, 2021లో 63 కంపెనీలు ఐపీఓ ప్రక్రియ నుంచి రూ. 1,18,723.17 కోట్లను సమీకరించాయి.

గత 21 నెలల్లో ఇప్పటివరకు స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన 161 ఐపీఓ కంపెనీలు సగటున 22 శాతం లిస్టింగ్ లాభాలను అందించాయని బెర్న్‌స్టెయిన్ తెలిపింది. వీటిలో 53 శాతం కంటే ఎక్కువ కంపెనీలు రెండంకెల లాభాలను ఇచ్చాయి. మొత్తం కంపెనీలో 28 (సుమారు 16 శాతం) ఐపీఓలు కన్స్యూమర్ టెక్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాలకు చెందినవి ఉన్నాయని నివేదిక పేర్కొంది.

Next Story