- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Silver: వెండి ఆభరణాల దిగుమతులపై ఆంక్షలు
థాయిలాండ్‌తో సహా మరికొన్ని దేశాల నుంచి సాదా వెండి ఆభరణాలు పెరుగుత్న్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ గమనించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: వెండి ఆభరణాల దిగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల గత కొన్ని నెలలుగా దేశంలో వెండి, వెండి ఉత్పత్తుల దిగుమతులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఆభరణాలు, విడిభాగాల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి వచ్చాయి. గత రెండు మూడు నెలలుగా థాయిలాండ్‌తో సహా మరికొన్ని దేశాల నుంచి సాదా వెండి ఆభరణాలు పెరుగుత్న్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ గమనించింది. ఈ దిగుమతులు సాధారణ డిమాండ్ కంటే చాలా ఎక్కువని మార్కెట్ నిపుణులూ చెబుతున్నారు. ఈ స్థాయి దిగుమతుల వల్ల ధరలు కృత్రిమంగా పెరిగేందుకు కారణమవుతోందని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే వెండి ఆభరణాల దిగుమతులను మరింత కఠినతరం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) జారీ చేసిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆంక్షలు 2026, మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
వెండి దిగుమతుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం పలు కీలక చర్యలు, మార్పులను ప్రవేశపెట్టింది. అవేంటంటే..
కొత్త నిబంధనలు
* ప్రభుత్వం కొన్ని ఆభరణాలు, విడిభాగాలను ఉచితంగా దిగుమతి చేసుకోకుండా పరిమితం చేసింది. దీనర్థం.. దిగుమతిదారులు వెండి ఆభరణాలను దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
* అలాగే, వెండిని ఎవరు దిగుమతి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే దానిపై నిబంధనలు కఠినతరం చేశారు. అధిక స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలను (99.9 శాతం నాణ్యత ఉన్నవి) దిగుమతి చేసుకోవడంలో పరిమితి విధించింది. ఇక నుంచి వెండిని స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవడానికి వీలులేదు.
* భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నామినేట్ చేసిన కొన్ని సంస్థలు, ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (ఐఐబీఎక్స్) ద్వారా అర్హత కలిగిన ఆభరణాలు మాత్రమే కొత్త నిబంధనల ప్రకారం దిగుమతి చేసుకోవచ్చు.
* పూర్తిగా తయారవని వెండి కడ్డీల దిగుమతికి ఎలాంటి నిబంధనలు లేవు, వాటిని గతంలో లాగే స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే వీలుంటుంది. కానీ పూర్తయిన లేదా అధిక-స్వచ్ఛత కలిగిన వెండి ఆభరణాల దిగుమతులకు ఈ నిబంధన మరింత కఠినతరం చేస్తుంది.
ఈ చర్యలు ఎందుకంటే..
ప్రధానంగా న్యాయబద్ధంగా వాణిజ్యం కొనసాగేందుకు, దేశీయ పరిశ్రమను రక్షించేందుకు ఈ రకమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంది. అధిక దిగుమతులు మార్కెట్‌ను ముంచెత్తితే (చౌకైన దిగుమతులు, స్థానిక ఉత్పత్తిదారులను తగ్గించడం), దేశీయ ఆభరణాల వ్యాపారులు, తయారీదారులు నష్టపోవచ్చు. అందుకే ప్రభుత్వం ఎక్కువ దిగుమతులను నివారించేందుకు ప్రయత్నిస్తోంది.






