India: 'వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్'లో భారత్‌కు 116వ ర్యాంకు

by S Gopi |

భారత్ రెండు ర్యాంకులు ఎగబాకి 116వ స్థానం దక్కించుకుంది.

India: వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్లో భారత్‌కు 116వ ర్యాంకు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన సంతృప్తిని అంచనా వేసే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 గురువారం విడుదలైంది. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ వరుసగా తొమ్మిదోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశంగా నిలిచింది. ఇదే సమయంలో భారత్ రెండు ర్యాంకులు ఎగబాకి 116వ స్థానం దక్కించుకుంది. దాదాపు మూడేళ్లుగా యుద్ధంలో ఉన్న ఇజ్రాయెల్, ప్రపంచంలో ఎనిమిదో అత్యంత సంతోషకరమైన దేశంగా ఉండటం విశేషం. అంతేకాకుండా ఈ జాబితాలో దాయాది పాకిస్తన్ మనకంటే ఎక్కువ సంతోషకరమైన దేశంగా 104వ స్థానంలో ఉండటం గమనార్హం. పొరుగున ఉన్న నేపాల్ కూడా 99వ ర్యాంకుతో మనకంటే ఎక్కువ సంతోషకర దేశంగా ఉంది. ఇక, ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ అట్టడున ఉంది. దీని తర్వాత సియెర్రా లియోన్, మలావి ఉన్నాయి. టాప్-10 స్థానాల్లో ఆంగ్లం మాట్లాడే దేశం ఏదీ లేకపోవడం గమనార్హం. ఇందులో అమెరికా 23వ స్థానంలో, కెనడా 25, యూకే 29వ స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి మద్దతుగల వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ మొత్తం 140 దేశాల శ్రేయస్సుకు సంబంధించి నివేదికను రూపొందిస్తుంది.

Next Story