Small Cars: చిన్న కార్ల కోసం ఉద్గారాల విడుదలలో నిబంధనలను సడలించే యోచనలో ప్రభుత్వం

by S Gopi |

దీనివల్ల చిన్న కార్లకు కొంత ఉపశమనం లభిస్తుంది.

Small Cars: చిన్న కార్ల కోసం ఉద్గారాల విడుదలలో నిబంధనలను సడలించే యోచనలో ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: చిన్న కార్లకు సంబందించి ప్రభుత్వం కఠినమైన ఇంధన సామర్థ్య నిబంధనలను తీసుకురానుంది. ఈ మేరకు నిబంధనల ముసాయిదా విడుదల చేసింది. ప్రస్తుత కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య నిబంధనల ప్రకారం, అనుమతించదగిన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల పరిమాణం వాహన బరువుతో ముడిపడి ఉంది. 3,500 కిలోల కంటే తక్కువ బరువున్న అన్ని ప్రయాణీకుల కార్లకు ఇది వర్తిస్తుంది. దీన్ని 909 కిలోలు అంతకంటే తక్కువ బరువున్న, నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవున్న పెట్రోల్ కార్లకు సవరించేలా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రతిపాదించింది. దీనివల్ల చిన్న కార్లకు కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్న కార్లు గతంలో కంటే కొంచెం ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడానికి అనుమతించవచ్చు. ఈ కొత్త నియమాలు చిన్న, తక్కువ ధర కార్లను తయారు చేసే కార్ల కంపెనీలకు సహాయపడతాయి. ముఖ్యంగా దేశంలో మధ్యతరగతి వర్గం సరసమైన కార్లను కొనేందుకు ఆస్కారం పెరుగుతుంది. ఇదే సమయంలో చిన్న వాహనాలను తయారు చేసే కంపెనీలపై ఒత్తిడిని తగ్గించినట్టు అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ విభాగంలో కార్లను తయారు చేసే కంపెనీ మారుతి సుజుకికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. ఈ కారణంగానే శుక్రవారం కంపెనీ షేర్లు పెరిగాయి.

Next Story