Wealth Creation: రానున్న 17 ఏళ్లలో దేశీయంగా భారీ సంపద సృష్టి

by S Gopi |

ముఖ్యంగా ఖర్చులు, పెట్టుబడులు, వ్యాపార లాభాలకు గణనీయంగా పెరుగుతాయని నివేదిక వివరించింది.

Wealth Creation: రానున్న 17 ఏళ్లలో దేశీయంగా భారీ సంపద సృష్టి
X

దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే రెండు దశాబ్దాల్లో సంప్ద సృష్టికి సంబంధించి భారత్ కీలక దశకు చేరుకుంటుందని ప్రముఖ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. భారత ఆర్థికవ్యవస్థ 2008లో 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 4 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్టే, 2042 నాటికి నాలుగు రెట్లు పెరిగి 16 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీనర్థం గతంలో కంటే చాలా ఎక్కువ సంపదను భారత్ సృష్టించగలదు. ముఖ్యంగా ఖర్చులు, పెట్టుబడులు, వ్యాపార లాభాలకు గణనీయంగా పెరుగుతాయని నివేదిక వివరించింది. ఈ వృద్ధిలో ఎక్కువ భాగం ఆర్థిక రంగం నుంచే రానుంది. వచ్చే 17 ఏళ్లలో దేశంలోని కుటుంబాలు 47 ట్రిలియన్ డాలర్లను ఆదా చేస్తాయని నివేదిక అంచనా వేసింది. ఇది బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆసెట్ మేనేజర్లు, ఎన్‌బీఎఫ్‌సీలు, స్టాక్ మార్కెట్ కంపెనీలకు భారీ అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలో ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందు. 2042 నాటికి తలసరి ఆదాయం ప్రస్తుతం ఉన్న 2,600 డాలర్ల(రూ. 2,35,500) నుంచి 10,000 డాలర్లు(రూ. 8,05,000) కంటే ఎక్కువగా ఉండవచ్చని, తద్వారా ఎక్కువమంది అధిక ఖర్చు వర్గాలకు మారనున్నారు. ఆదాయాలు పెరిగేకొద్దీ, ప్రజలు జీవనశైలి, ఎలక్ట్రానిక్స్, ప్రయాణం, ఆరోగ్య సంరక్షణ, టెలికాం, ఫుడ్ సర్వీసెస్, క్విక్ కామర్స్ వంటి విచక్షణతో కూడిన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది.

Next Story