- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tariff: మరిన్ని పన్ను తగ్గింపులకు సిద్ధంగా భారత్: నిర్మలా సీతారామన్
భారత ప్రభుత్వం పన్నులను మరింత తగ్గించే చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భాగస్వామ్య దేశాలైనా సరే పరస్పర సుంకాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం పన్నులను మరింత తగ్గించే చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ఇప్పటికే టెక్స్‌టైల్స్, మోటార్‌సైకిళ్ల దిగుమతి సుంకాలపై భారీగా కోత విధించిన అనంతరం, దేశంలో పన్నులను సంస్కరించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. భారత్‌ను పెట్టుబడిదారులకు స్నేహపూర్వక దేశంగా నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నాం. దానికోసం ఇప్పటికే ప్రకటించిన పన్ను తగ్గింపులు, హేతుబద్దీకరణను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. కొవిడ్ మహమ్మారి తర్వాత ఇప్పటికే అత్యంత బలహీన వృద్ధిని కొనసాగిస్తున్న భారత్‌ను మరింత మెరుగుపరిచేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం నిర్దేశించారు. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని నివారించేందుకు ఇప్పటికే పన్ను రాయితీ నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న నెలల్లో ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు సంకేతాలిచ్చారు.






