- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tariff: హార్లే బైక్‌లు, బోర్బన్ విస్కీపై దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో భారత్
మరోసారి ప్రీమియం బైక్‌లను దేశీయ మార్కెట్‌లో మరింత సరసమైన ధరలకు అందించడానికి, టారిఫ్‌లను మరింత తగ్గించే దిశగా ప్రయత్నాలు

దిశ, బిజినెస్ బ్యూరో: యునైటెడ్ స్టేట్స్‌తో కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లు, బోర్బన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించడాన్ని భారత ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. మూలాల ప్రకారం, కొన్ని ఉత్పత్తులపై సుంకాలను మరింత తగ్గించడానికి, వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ప్రభుత్వం గతంలోనే హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లపై దిగుమతి సుంకాలను 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మరోసారి ఈ ప్రీమియం బైక్‌లను దేశీయ మార్కెట్‌లో మరింత సరసమైన ధరలకు అందించడానికి, టారిఫ్‌లను మరింత తగ్గించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అదేవిధంగా, బోర్బన్ విస్కీపై దిగుమతి సుంకం గతంలో 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. రెండు దేశాల మధ్య సులభ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అధికారులు ఇప్పుడు మరోసారి కోత విధించాలని భావిస్తున్నారు. కాలిఫోర్నియా వైన్‌పై కూడా పన్ను తగ్గింపు అంశం చర్చల్లో ఉంది.
పన్ను తగ్గింపు చర్యలు మోటార్‌సైకిళ్లు, మద్యానికే పరిమితం కాలేదు. అమెరికా నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, కెమికల్ ఉత్పత్తుల ఎగుమతులపై కూడా అధికారులు చర్చిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఔషధ రంగంలో మార్కెట్ వాటాను పెంచుకోవడానికి యూఎస్ ఆసక్తిగా ఉంది, అదే సమయంలో యూఎస్‌కి ఎగుమతే చేసే అంశంలో అనుకూలమైన నిబంధనల హామీ పొందాలని భారత్ ప్రయత్నిస్తోంది. అమెరికా నుంచి భారత ఔషధ ఉత్పత్తుల దిగుమతులు ఇటీవలి కాలంలో గణనీయమైన పెరిగాయి. 2021-22లో ఈ ఎగుమతులు 78.8 శాతం పెరిగాయి. అయితే, 2022-23లో 27.5 శాతం తగ్గినప్పటికీ, 2023లో ట్రెండ్ మళ్లీ 10.8 శాతం పుంజుకున్నాయి. ప్రతిపాదిత టారిఫ్ తగ్గింపులు అమలైతే, హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లు దేశీయ ప్రీమియం బైక్ ప్రియులకు మరింత తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. బోర్బన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్‌పై తక్కువ సుంకాల వల్ల దేశీయ మద్యం మార్కెట్‌లో మరింత పోటీ ఉండనుంది. అలాగే, యూఎస్ నుంచి పెరిగిన ఔషధ దిగుమతులు గ్లోబల్ జెనరిక్ మెడిసిన్ మార్కెట్‌లో కీలకంగా ఉన్న భారతీయ ఔషధ తయారీదారులపై ప్రభావం చూపుతాయి.






