Electronics: 6 రెట్లు పెరిగిన భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు

by S Gopi |

భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ గత పదేళ్లలో 5 రెట్లు పెరిగి రూ. 11 లక్షల కోట్లకు చేరుకుంది.

Electronics: 6 రెట్లు పెరిగిన భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాల కారణంగా గడిచిన దశాబ్ద కాలంలో భారత ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయి. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో విశ్వసనీయత పెరిగిందని, ఐపీ హక్కుల ద్వారా మన ఉత్పత్తులు ప్రపంచ గుర్తింపు పొందాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మానేసర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ గత పదేళ్లలో 5 రెట్లు పెరిగి రూ. 11 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఎగుమతులు 6 రెట్లు పెరిగి రూ. 3.25 లక్షల కోట్లు దాటాయి. ఫలితంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 25 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. వీటికంటే గ్లోబల్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులపై నమ్మకం పెరిగిందని, మేధో సంపత్తి హక్కుల విషయంలో సరైన గౌరవం లభిస్తోందని మంత్రి వివరించారు. దేశీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందన్నారు. దీనివల్ల సంక్లిష్ట కలిగిన ఉత్పత్తులను సైతం డిజైన్ చేయగలిగే సామర్థ్యం పెరిగింది. ఏఐ కెమెరాల నుంచి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్, టెలికాం నెట్‌వర్క్ పరికరాలు, పవర్ ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని భారత్‌లో తయారవుతున్నాయి. క్రమంగా ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారుతోందని మంత్రి వెల్లడించారు.

Next Story