Economy: వచ్చే ఏడాది భారత వృద్ధి 7.5 శాతం: యాక్సిస్ క్యాపిటల్

by S Gopi |

చౌకైన రుణాల వల్ల వ్యాపారాలు, వినియోగదారుల నుంచి రుణాలు తీసుకునే అవకాశాలు పెరుగుతాయి.

Economy: వచ్చే ఏడాది భారత వృద్ధి 7.5 శాతం: యాక్సిస్ క్యాపిటల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని యాక్సిస్ క్యాపిటల్ నివేదిక తెలిపింది. ఇండియా మార్కెట్ ఔట్‌లుక్-2026 పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం, వడ్డీ రేట్లను తగ్గించడం మూలంగా క్రెడిట్ వృద్ధి మరింత మెరుగుపడుతుందని, పెట్టుబడి, వినియోగానికి బలమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం తన ఖర్చులను నియంత్రించడం కొనసాగిస్తున్నప్పటికీ, ఒత్తిడి మునుపటి కంటే తేలికగా ఉంటుంది. చౌకైన రుణాల వల్ల వ్యాపారాలు, వినియోగదారుల నుంచి రుణాలు తీసుకునే అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ఖర్చు, పెట్టుబడులను పెంచుతుంది. అదే సమయంలో, సులభ వ్యాపార నిబంధనలు, లేబర్ కోడ్స్ మార్పులు, తక్కువ నియంత్రణ అడ్డంకులు వృద్ధికి తోడ్పడతాయని భావిస్తున్నారు. గత కొంత కాలంగా భారత్ 7 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, దేశం దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం ఇంకా ఎక్కువగా ఉందని నిపుణులు నమ్ముతున్నారు. వేగవంతమైన వృద్ధి ఉన్నప్పటికీ, ధరలు అదే స్థాయిలో పెరిగే అవకాశం లేదు. ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన ద్రవ్యోల్బణం 4 శాతానికి దగ్గరగా ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ రీసెర్చ్ అంచనా వేసింది.

Next Story