- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EVs: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మార్కెట్లో భారత్ ఆధిపత్యం
ఫేమ్, పీఎం ఈ-డ్రైవ్ వంటి పథకాలు ఎలక్ట్రిక్, సాంప్రదాయ ఇంధన వాహనాల మధ్య ధరల వ్యత్యాసాన్ని తగ్గించడంలో విజయం సాధించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మార్కెట్లో భారత్ సత్తా చాటుతోంది. 2024లో అంతర్జాతీయంగా అమ్ముడిన ఈవీ త్రీ-వీలర్ అమ్మకాల్లో 57 శాతం వాటాతో ఆధిపత్యం సాధించింది. ఈ మేరకు బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరిగిన సీఓపీ30 కార్యక్రమం సందర్భంగా జీరో-ఎమిషన్ వెహికల్(జీఈవీ) పరివర్తనపై కొత్త పురోగతి పేరుతో విడుదలైన నివేదిక తెలిపింది. ఇది భారత్ ఇతర దేశాల కంటే మెరుగ్గా క్లీన్ మొబిలిటీ వైపు అడుగులు వేయడాన్ని సూచిస్తుందని, ప్రపంచ జీర్-ఎమిషన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లకు ప్రపంచం మారడానికి భారత్ కీలక డ్రైవర్‌గా నిలుస్తుందని నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు భారత ప్రభుత్వం ఫేమ్, పీఎం ఈ-డ్రైవ్ వంటి పథకాలు ఎలక్ట్రిక్, సాంప్రదాయ ఇంధన వాహనాల మధ్య ధరల వ్యత్యాసాన్ని తగ్గించడంలో విజయం సాధించాయి. ముఖ్యంగా లాస్ట్-మైల్ మొబిలిటీ విభాగంలో పెద్ద ఎత్తున ఈవీల వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులకు ఆజ్యం పోశాయి. పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 25 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, 3.2 లక్షల త్రీ-వీలర్ల అమ్మకాలు జరిగాయి. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ. 2,800 కోట్ల సబ్సిడీలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసింది. ఇదే క్రమంలో జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు 2030 నాటికి 100 శాతం ఈవీలకు మారేందుకు సిద్ధమవుతున్నాయి.






