Sam Altman: ఏఐ లీడర్‌గా ఉండేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి: శామ్ ఆల్ట్‌మన్

by S Gopi |

భారత ప్రభుత్వం ఇండియాఏఐ మిషన్ లక్షలాది మందికి అవసరమైన సాధనంగా మారుతోంది.

Sam Altman: ఏఐ లీడర్‌గా ఉండేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి: శామ్ ఆల్ట్‌మన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పూర్తిస్థాయిలో ఏఐ లీడర్‌గా ఉండేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. మనదేశంలో గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగానికి కొన్ని గంటల ముందు శామ్ ఆల్ట్‌మన్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భారత్‌కు ఉన్నటెక్నాలజీ ప్రతిభ, జాతీయ వ్యూహం, టెక్నాలజీ సామర్థ్యంపై నమ్మకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారత్ స్వదేశీ నైపుణ్యం ద్వారా ఏఐలో సరైన స్థాయిలో అమలు చేసేందుకు విధానపరమైన ప్రోత్సాహం కలిగి ఉంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఇండియాఏఐ మిషన్ లక్షలాది మందికి అవసరమైన సాధనంగా మారుతోంది. కంప్యూటర్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు, స్టార్టప్‌లకు మద్దతిచ్చేందుకు, హెల్త్‌కేర్, వ్యవసాయం, పబ్లిక్ సర్వీసెస్‌లో యాప్‌లను రూపొందించడంలో విజయవంతమైందని శామ్ ఆల్ట్‌మన్ వివరించారు. ఏఐ టూల్స్‌ను వేగంగా ఉపయోగించడంలో 10 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో భారత్ పూర్తిస్థాయి ఏఐ లీడర్‌గా ఉండటానికి అన్ని అర్హతలను కలిగి ఉంది. ఏఐ ప్రయోజనాలను విస్తరించేందుకు యాక్సెస్, అడాప్షన్, ఏజెన్సీపై పురోగతి అవసరమని శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు.

Next Story