- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Indian Economy: భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థ
ఈ క్రమంలో ట్రంప్ భారత్‌ను 'డెడ్ ఎకానమీ'గా చెప్పడం పొరపాటే అని నిపుణులు చెబుతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు కారణంగా అనేక సందర్భాల్లో విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా భారత ఆర్థికవ్యవస్థను ఉద్దేశించి 'డెడ్ ఎకానమీ' అని అభివర్ణించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను ఆర్థిక నిపుణులు సైతం తిరస్కరిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) సహా అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ భారత్‌ను 'డెడ్ ఎకానమీ'గా చెప్పడం పొరపాటే అని నిపుణులు చెబుతున్నారు. భారత్ పెట్టుబడులు, సాంకేతిక ప్రతిభకు ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. విదేశీ పెట్టుబడులకు ఇప్పటికీ భారత్ కీలకమైన కేంద్రంగా ఉంది. అనేక అంతర్జాతీయ దిగ్గజాలు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (జీసీసీ) తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాకుండా, కీలక టెక్ రంగంలో భారతీయుల ప్రతిభకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాతో సహా అనేక దేశాలకు ప్రధాన సేవల ఎగుమతిదారుగా భారత్ ఉన్న సంగతి మరవొద్దని అన్నారు.
భారత్‌కు వ్యతిరేకంగా ట్రంప్ వ్యాఖ్యలను కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా 'చాలా తప్పుగా' పేర్కొంది. వాస్తవానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారత్‌ను కేంద్రంగా చూస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు వేగంగా వెనుకబడుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ డయాస్పోరా అందించే సహకారం సానుకూల వృద్ధిని చూపుతూనే ఉందని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ చెప్పారు. భారత్‌కు ఉన్న యువ జనాభా ఆర్థిక చైతన్యానికి ఆజ్యం పోస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అక్యరాజ్యసమితి జనాభా గణాంకాలు (2024) ప్రకారం, భారత జనాభా సగటు వయస్సు 28.8 సంవత్సరాలు అయితే, అమెరికా జనాభా 38.5, యూరప్ జనాభా 42.8 సంవత్సరాలుగా ఉందని ఈవాఇ ఇండియా పేర్కొంది.






