Nirmala Sitaraman: వరుసగా నాలుగో ఏడాది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్

by S Gopi |

ప్రధానంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు, సేవలు, వ్యవసాయ, తయారీ రంగాలు తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపారు

Nirmala Sitaraman: వరుసగా నాలుగో ఏడాది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ వరుసగా నాలుగో ఏడాదిలోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనికి ప్రధానంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు, సేవలు, వ్యవసాయ, తయారీ రంగాలు తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపారు. శుక్రవారం లక్నోలో జరిగిన ఓ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. జనవరి-మార్చి త్రైమాసికంలో పరిశ్రమల నుంచి పెట్టుబడులు తగ్గడం, కంపెనీల విస్తరణ, ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపగలిగే పరిస్థితిలో లేవు. దేశం అధిక వృద్ధి సాధించాల్సిన స్థాయిలో పరిశ్రమల నుంచి పెట్టుబడులు రావడం లేదు, వాటి సామర్థ్యాన్ని పెంచడంపై సందేహాలు ఉన్నాయి. కానీ, ఈ ప్రతికూలతలను దాటి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత తయారీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. అందుకే దేశ జీడీపీ నాలుగో త్రైమాసికంలో 7.4 శాతం వృద్ధి సాధించగలిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి 6.5 శాతం నమోదవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు కీలక మద్దతు ఇచ్చాయన్నారు. కరోనా సమయంలోనూ, ఆ తర్వాత కూడా వ్యవసాయ రంగం దేశ వృద్ధిని నిలబెట్టిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Next Story