- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EV: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ బూమ్
రూ. 20–30 లక్షల మధ్య ఉన్న ఈవీలకు డిమాండ్ పెరిగితే, రూ. 10 లక్షల లోపు చవక వాహనాల వాటా తగ్గింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాలు దాదాపు 87 శాతం పెరిగి 2.33 లక్షల యూనిట్లకు చేరాయి. అయితే ఈ వృద్ధి ఎక్కువగా మధ్య, అధిక ధరల వాహనాల్లోనే కనిపించింది. రూ. 20–30 లక్షల మధ్య ఉన్న ఈవీలకు డిమాండ్ పెరిగితే, రూ. 10 లక్షల లోపు చవక వాహనాల వాటా తగ్గింది. అంటే, ఈవీలు సాధారణ వినియోగదారులకు ఇంకా పూర్తిగా అందుబాటు ధరలో లేవని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీలు అమ్మకాలను నడిపిస్తున్నాయి. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ వంటి కంపెనీల మోడళ్లకు ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది.
ఎంట్రీ-లెవల్ ఈవీల విభాగంలో ఎక్కువ మోడల్స్ లేకపోవడంతో వృద్ధి మందగించింది. నిపుణుల ప్రకారం, రూ. 10–12 లక్షల లోపు మంచి ఈవీలు అందుబాటులోకి రాకపోతే, ఈవీ మార్కెట్ విస్తరణ నెమ్మదిగానే సాగుతుంది. దీనికి ప్రధాన కారణం బ్యాటరీ ఖర్చులు ఎక్కువగా ఉండటమే. కొత్త ప్రభుత్వ నిబంధనలు వాహన తయారీదారులను మరిన్ని ఈవీలు తయారు చేయడానికి ప్రోత్సహిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.






