- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India US Oil Imports: అమెరికా నుంచి భారీగా పెరిగిన ముడిచమురు దిగుమతులు
అక్టోబర్ 27 నాటికి అమెరికా నుంచి రోజుకు 5.40 లక్షల బ్యారెళ్ల ముడిచమురు మనదేశానికి దిగుమతి జరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అమెరికా నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు భారీగా పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్‌తో ముడిచమురు ఒప్పందాలు భారీగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు కూడా వెల్లడిస్తున్నాయి. తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి కూడా గణనీయంగా ముడిచమురు దిగుమతులు జరిగాయి. కెప్లర్ డేటా ప్రకారం, అక్టోబర్ 27 నాటికి అమెరికా నుంచి రోజుకు 5.40 లక్షల బ్యారెళ్ల ముడిచమురు మనదేశానికి దిగుమతి జరిగింది. 2022 తర్వాత ఇదే అత్యధికం. అమెరికా ఎగుమతుల డేటా ప్రకారం, అక్టోబర్ నెల ముగిసే నాటికి ఈ దిగుమతులు 5.75 లక్షల బ్యారెళ్లకు పెరగవచ్చు. అలాగే, నవంబర్‌లోనూ 4 లక్షల నుంచి 4.5 లక్షల బ్యారెళ్ల మధ్య అమెరికా ముడిచమురు దిగుమతులు ఉంటాయని అంచనా. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సగటున దిగుమతులు 3 లక్షల బ్యారెళ్లుగా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు పెరగడానికి ఆర్థిక అంశాలే కారణమని కెప్లర్ ప్రధాన పరిశోధన విశ్లేషకులు సుమిత్ రిటోలియా అన్నారు.
రష్యా ఇప్పటికీ అతిపెద్ద సరఫరాదారే
అయితే, రష్యా ఇప్పటికీ భారత్‌కు ముడిచమురును సరఫరా చేస్తున్న అతిపెద్ద సరఫరాదారుగా కొనసాగుతోంది. సగటున 17.5 లక్షల బ్యారెళ్ల డెలివరీలు జరిగాయి. ఇరాక్ రెండో స్థానంలో ఉంది, ఆ తరువాత సౌదీ అరేబియా ఉంది. యూఎస్ ముడిచమురు వాటాను పెంచడం మనదేశానికి సానుకూలంగా ఉన్నప్పటికీ, వాషింగ్టన్ నుంచి కొనుగోళ్ల కోసం భారత చమురు శుద్ధి సంస్థలకు అధిక సరుకు రవాణా ఖర్చులు సవాలుగా ఉన్నాయి.






