- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: స్థిరమైన ప్రపంచ సరఫరా వ్యవస్థను నిర్మించే దిశగా భారత్
భారత్‌కు ఉన్న బలాలు, సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేలా చూసుకుంటుందని తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ తన సరఫరా వ్యవస్థను దీర్ఘాకాలానికి అవసరమయ్యేలా నిర్మించుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనికోసం భారత్‌కు ఉన్న బలాలు, సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేలా చూసుకుంటుందని తెలిపారు. మంగళంవారం ఇటలీలోని మిలన్‌లో జరిగిన ఏడీబీ గవర్నర్ల సెమినార్‌లో మాట్లాడిన ఆర్థిక మంత్రి.. సరఫరా వ్యవస్థ అనేది ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న విధానం కాదు, దేశాలు తమ వనరులను ఉపయోగించి స్థిరమైన సరఫరా అందించే పద్దతి. భారత్ దీన్నే నిర్మించాలని భావిస్తోందన్నారు. ప్రపంచ సరఫరా వ్యవస్థను స్థిరంగా కొనసాగించే దిశగా పనిచేస్తోందన్నారు. ఇది స్వల్ప కాలానికి దేశాలు సమస్యలను పరిష్కరించడం కాకుండా, మనల్ని మనం మరింత బలోపేతం చేసుకోవడం. అంతకంటే ఎక్కువే అనొచ్చు. ప్రభుత్వ విధానాలతో తయారీ, సేవల రంగానికి మద్దతివ్వడం ద్వారా భారత్ టెక్నాలజీ, మ్యాన్‌పవర్, స్కిల్స్ వంటి కీలక వనరులను ఉపయోగించడంపై దృష్టి సారిస్తోంది. ఈ విధానం వల్ల సేవల రంగం ప్రస్తుతం దేశ జీడీపీలో 60 శాతం సహకారం అందిస్తుండగా, తయారీ రంగం క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఫార్మా, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ వంటి 14 ప్రాధాన్యత కలిగిన రంగాలకు ప్రభుత్వ సాయం ద్వారా తయారీ రంగం 13 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. భారత్ తన వద్ద ఉన్న శ్రామికశక్తి, సాంకేతికత, వృద్ధి సామర్థ్యం ద్వారా మరింత బలోపేతం కావాలని భావిస్తోంది. ప్రధాన రంగాలపై దృష్టి సారించి మరింత మెరుగైన సఫరా వ్యవస్థను నిర్మించనున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.






