Tata Group: ప్రపంచ అనిశ్చితి మధ్య బ్రైట్ స్పాట్‌గా భారత్: ఎన్ చంద్రశేఖరన్

by S Gopi |

భారత్ దీర్ఘకాలిక వృద్ధికి దేశంలో ఉన్న అధిక జనాభా, ఎకనమిక్ ఫండమెంటల్స్, ప్రభుత్వ సంస్కరణలు కీలక మద్దతుగా ఉంటాయి.

Tata Group: ప్రపంచ అనిశ్చితి మధ్య బ్రైట్ స్పాట్‌గా భారత్: ఎన్ చంద్రశేఖరన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత్ ఆర్థిక వృద్ధిలో బ్రైట్ స్పాట్‌గా ఉందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేహరన్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కంపెనీ వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ దీర్ఘకాలిక వృద్ధికి దేశంలో ఉన్న అధిక జనాభా, ఎకనమిక్ ఫండమెంటల్స్, ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు కీలక మద్దతుగా ఉంటాయి. ఈ ఏడాది స్థిరమైన వృద్ధి అంచనాలు, తగ్గుతున్న ద్రవ్యోల్బణం, పాలసీ విధానాల్లో మార్పులు భారత వృద్ధిని ముందుకు తీసుకెళ్తాయి. అమెరికా ఇటీవల ప్రకటించిన టారిఫ్ ప్రభావం భారత్‌పై తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులు మన దేశ జీడీపీలో 2 శాతం కంటే కొంచెం మాత్రమే ఉంటాయి. ఇది అభివృద్ధి చెందుతున్న అన్ని మార్కెట్ల కంటే తక్కువని ఎన్ చంద్రశేఖరన్ వాటాదారులను ఉద్దేశించి చెప్పారు. ప్రీమియమైజేషన్, హెల్త్ అండ్ వెల్నెస్ వంటి విభాగాల్లో వినియోగదారుల ధోరణులు వేగంగా మారుతున్నాయి. క్విక్ కామర్స్ అత్యంత వేగంగా పుంజుకుంటోంది. ఇదే సమయంలో రిటైల్ స్టోర్ల అమ్మకాలు కూడా సమానంగానే కొనసాగడం సానుకూల పరిణామం. గత కొంతకాలంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, సంక్లిష్ట పరిస్థితులను కంపెనీలు మెరుగైన అవకాశంగా ఎంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Next Story