- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5G Subscribers: ఐదేళ్లలో 98 కోట్లకు చేరనున్న 5జీ కస్టమర్లు
2024 నాటికి దేశంలో 5జీ సబ్‌స్క్రైబర్లు 29 కోట్లుగా ఉన్నారు. ఇది మొత్తం మొబైల్ సబ్‌స్క్రైబర్లలో 24 శాతం

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో 5జీ నెట్‌వర్క్ వినియోగం అత్యంత వేగంగా పెరుగుతోంది. ఇదే స్థాయిలో పెరిగితే 2030 నాటికి దేశవ్యాప్తంగా 5జీ సబ్‌స్క్రైబర్ బేస్ మూడు రెట్లు పెరిగి దాదాపు 98 కోట్లకు చేరుకుంటుందని ఓ నివేదిక అంచనా వేసింది. ఇదే సమయంలో దేశంలో ఉన్న 4జీ కస్టమర్ల సంఖ్య ఏకంగా 60 శాతం క్షీణించి 23 కోట్లకు చేరుకుంటుందని స్వీడిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ మంగళవారం ప్రకటనలో తెలిపింది. కంపెనీ నిర్వహించిన మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం, 4జీ సబ్‌స్క్రైబర్ల సఖ్య భారీగా పెరగడమే కాకుందా మొత్తం యూజర్ బేస్‌లో 74 శాతం వాటా సొంతం చేసుకుంటుంది, 4జీ కస్టమర్లు సగం కంటే ఎక్కువగా తగ్గిపోనున్నారు. 2024 నాటికి దేశంలో 5జీ సబ్‌స్క్రైబర్లు 29 కోట్లుగా ఉన్నారు. ఇది మొత్తం మొబైల్ సబ్‌స్క్రైబర్లలో 24 శాతం. అలాగే, 2024లో దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడే ఒక్కో వినియోగదారులు అత్యధికంగా 32జీబీ డేటా వాడకంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారని, 2030 నాటికి ఇది 62జీబీకి చేరుకోవచ్చని నివేదిక అభిప్రాయపడింది. దీని ఆధారంగా దేశంలో 5జీ మౌలిక సదుపాయాలను మరింత పెంచాలని నివేదిక సూచించింది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 5జీ నెట్‌వర్క్ విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎరిక్సన్ పేర్కొంది.






