- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: 2026-27లో భారత జీడీపీ వృద్ధి 6.9 శాతం: ఇండ్-రా అంచనా
ఇందుకు ప్రధానంగా జీఎస్టీ తగ్గింపు, ఆదాయపు పన్ను కోత వంటి కీలక సంస్కరణలు దోహదపడతాయని ఇండ్-రా అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ మెరుగైన వృద్ధిని కొనసాగిస్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) అభిప్రాయపడింది. ముఖ్యంగా వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 6.9 శాతం వృద్ధిని సాధించగలదని అంచనా వేసింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందుకు ప్రధానంగా జీఎస్టీ తగ్గింపులతో పాటు ఆదాయపు పన్ను కోత వంటి కీలక సంస్కరణలు, వాణిజ్య ఒప్పందాలు దోహదపడతాయని, ఈ అంశాలు ప్రపంచ అనిశ్చితి నుంచి ఆర్థికవ్యవస్థను రక్షిస్తాయని ఇండ్-రా అభిప్రాయపడింది. దేశ ఆర్థికవ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అధిక వృద్ధిని కొనసాగించగలదని, రిటైల్ ద్రవ్యోల్బణం సైతం సగటున 3.8 శాతం నమోదు అవ్వొచ్చని ఇండ్-రా అభిప్రాయపడింది. భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందం కూడా అధిక జీడీపీ వృద్ధికి తోడ్పడుతుందని ఇండ్-రా ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ అన్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ వాస్తవ జీడీపీ వృద్ధిని 7.4 శాతంగా, నామమాత్రపు జీడీపీని 9 శాతంగా ఇండ్-రా అంచనా వేసింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కరెన్సీ రూపాయి విలువ సగటున డాలర్‌కు రూ. 88.64గా ఉంది. కానీ, 2026-27లో ఇది సగటు డాలర్‌కు రూ. 92.26కి చేరుకోవచ్చని పేర్కొంది.






