World Asthma Day 2025: రోజురోజుకు పెరుగుతున్న ఆస్థమా రోగుల సంఖ్య..పిల్లలు,మహిళల సంఖ్యే ఎక్కువ.!

by Vennela |

World Asthma Day 2025: ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

World Asthma Day 2025: రోజురోజుకు పెరుగుతున్న ఆస్థమా రోగుల సంఖ్య..పిల్లలు,మహిళల సంఖ్యే ఎక్కువ.!
X

దిశ, వెబ్ డెస్క్: World Asthma Day 2025: ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద అంతరం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఆస్తమా అనేది కనిపిస్తోంది. ఆస్తమా అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే ఒక ఇన్ఫెక్షన్ దీని ద్వారా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లలు పెద్దల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం, ముఖ్యంగా ఈరోజు ఆస్తమా పేషెంట్లపై అవగాహనను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కొన్ని సందర్భాల్లో ఆస్తమా అనేది ప్రాణాపాయం కూడా కావచ్చు కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలో గుండెపోటు తర్వాత ఆస్తమా వల్ల కలిగే మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్యానిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమాకు అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం దీనికి ప్రధానం అని చెప్పవచ్చు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల్లో చేరి ఆస్తమా వ్యాధిని కలగజేస్తున్నాయి. ఈ ఆస్తమాబారి నుంచి బయటపడేందుకు కాలుష్యం పరిసరాలను వీడి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా రోడ్డుపై వెళ్లేటప్పుడు పొగ ఇతర కాలుష్య కారకాలను పీల్చకుండా మాస్క్ ధరించాలని ఎన్95 మాస్క్ ధరిస్తే అందులో ఉండే దళసరి ఫిల్టర్ మీ ఊపిరితిత్తుల్లోకి కాలుష్య కారకాలు వెళ్లకుండా అడ్డుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా, ఉబ్బసం ఉన్నవారికి అవగాహన పెంచడానికి, మెరుగైన సంరక్షణను అందించడానికి గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA) ప్రతి సంవత్సరం ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని (WAD) నిర్వహిస్తుంది.

2025 ప్రపంచ ఆస్తమా దినోత్సవం థీమ్ 'Make Inhaled Treatments Accessible for ALL' అని తీర్మానించారు. ప్రపంచ వ్యాప్తంగా 260 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమైన ఆస్తమా అత్యంత సాధారణమైన నాన్-కమ్యూనికబుల్ దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏటా 450,000 కంటే ఎక్కువ మరణాలకు కారణమవుతుంది. ఈ మరణాలలో ఎక్కువ భాగాన్ని సరైన జాగ్రత్తల, మందులతో నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story