- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Prices(27-02-2026): పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి?
ఇవాళ(శుక్రవారం) ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,65,570గా ఉంది.

దిశ,వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక పెళ్లి అనగానే మొదటగా గుర్తొచ్చేది బంగారమే. ఇక గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు పెళ్లిళ్ల సీజన్‌లో అయిన తగ్గుముఖం పడతాయేమో అనుకున్నారు. కానీ బంగారం, వెండి ధరలు ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో నేడు(ఫిబ్రవరి 27) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న(గురువారం) రూ.1,61,020 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు(శుక్రవారం) రూ.550 పెరిగి రూ.1,65,570గా ఉంది. అలాగే నిన్న రూ.1,47,600 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.500 పెరిగి రూ.1,48,100గా ఉంది. ఇక ఇవాళ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.2,95,000గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.






