IMF: భారత వృద్ధిని పెంచిన ఐఎంఎఫ్

by S Gopi |

ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను భారత్ ధీటుగా ఎదుర్కోగలదని ఐఎంఎఫ్ పేర్కొంది.

IMF: భారత వృద్ధిని పెంచిన ఐఎంఎఫ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతున్నట్టు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. జనవరిలో ప్రకటించిన అంచనాల కంటే 10 బేసిస్ పాయింట్లు ఎక్కువగా 6.5 శాతం భరత్ వృద్ధి చెందగలదని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఇందుకు ప్రధానంగా అమెరికా మనదేశంపై విధించిన సుంకాలను 50 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడమే కారణమని తెలిపింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను భారత్ ధీటుగా ఎదుర్కోగలదని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇదే సమయంలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా నమోదు కావొచ్చని ఐఎంఎఫ్ తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం అనుకున్న దానికంటే ఎక్కువ కాలం కొనసాగడం వల్లనే ద్రవ్యోల్బణం ప్రభావితం అవుతోంది. ఒకవేళ ఈ ఏడాది ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సగటున 120 డాలర్లుగా ఉంటే, భారత వృద్ధి 6.1-6.2 శాతానికి పరిమితం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి భారత్ ప్రపంచ వృద్ధి కంటే ఎక్కువగానే సాధిస్తుందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు.

Next Story