Middle East Crisis: పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కోఆర్డినేషన్ గ్రూప్ ఏర్పాటు

by S Gopi |

ఈ యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన కొరతకు దారితీసిందని ఐఎంఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.

Middle East Crisis: పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కోఆర్డినేషన్ గ్రూప్ ఏర్పాటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా యుద్ధం వల్ల కలిగే ఆర్థిక, ఇంధన సంక్షోభానికి ఎదుర్కొనే చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ), అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధిపతులు ఒక సమన్వయ బృందాన్ని(కోఆర్డినేషన్ గ్రూప్) ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. ఈ యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన కొరతకు దారితీసిందని ఐఎంఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. చమురు, గ్యాస్, ఎరువుల మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీస్తోంది. చమురు దిగుమతి చేసుకునే, ముఖ్యంగా అల్పాదాయ దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే పెరిగిన చమురు, గ్యాస్, ఎరువుల ధరల రూపంలో వ్యాపిస్తోంది. ఇది ఆహార ధరల గురించి కూడా ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ సంక్షోభం మార్కెట్లలో అస్థిరతకు, అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో కరెన్సీ బలహీనతకు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇది మరింత కఠిన పాలసీ విధానానికి, వృద్ధి క్షీణతకు దారితీయవచ్చు. మూడు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసే బృందం యుద్ధ ప్రభావాన్ని పర్యవేక్షించి ప్రభుత్వాలతో సమన్వయం చేస్తుంది. ఎక్కువ నష్టాలను ఎదుర్కొనే దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. గ్లోబల్ మార్కెట్లను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది.

Next Story