IMF: భారత వృద్ధిని 30 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఐఎంఎఫ్

by S Gopi |

ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం భారత వృద్ధికి కీలక మద్దతిస్తుంది.

IMF: భారత వృద్ధిని 30 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఐఎంఎఫ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తన తాజా వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో భారత వృద్ధి అంచనాను ఏకంగా 30 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.2 శాతానికి తగ్గించింది. మంగళవారం అంతర్జాతీయంగా పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధిలో నెలకొన్న అనిశ్చితి ప్రభావం ఇందుకు ప్రధాన కారణమని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం భారత వృద్ధికి కీలక మద్దతిస్తుంది. కానీ వాణిజ్యపరమైన సవాళ్లు, ప్రపంచ అనిశ్చితి కారణంగా ప్రభావితం కానుంది. అయినప్పటికీ మిగిలిన ఆర్థికవ్యవస్థల కంటే భారత వృద్ధి 2025 (2025-26)లో వృద్ధి కొనసాగుతుంది. ప్రస్తుత ఏడాదిలోనే చైనా 4.6 శాతం నుంచి 4 శాతానికి నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. అమెరికా వృద్ధి 2.7 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కొత్త టారిఫ్‌ల వల్ల అమెరికా, చైనా దేశాలు నేరుగా ఎక్కువ ప్రభావితం అవుతాయి. ఆసియా, యూరప్‌లోని దేశాలు మోస్తరుగా ఒత్తిడిని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.

Next Story