CIBIL Score: ఈ నాలుగు టెక్నిక్స్ పాటిస్తే చాలు మీ సిబిల్ స్కోర్ 600 ఉన్న 800లకు పెరగడం ఖాయం..!!

by Vennela |

CIBIL Score: బ్యాంకులో లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ అనేది ఈ మధ్యకాలంలో తప్పనిసరిగా మారిపోయింది.

CIBIL Score: ఈ నాలుగు టెక్నిక్స్ పాటిస్తే చాలు మీ సిబిల్ స్కోర్ 600 ఉన్న 800లకు పెరగడం ఖాయం..!!
X

దిశ, వెబ్ డెస్క్: CIBIL Score: బ్యాంకులో లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ అనేది ఈ మధ్యకాలంలో తప్పనిసరిగా మారిపోయింది. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న నేపథ్యంలో బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తాయి. అయితే సిబిల్ స్కోర్ మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల భారీగా పడిపోతుంది మరి ఈ సిబిల్ స్కోర్ ని ఎలా సరిదిద్దుకోవాలి ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా నాలుగు టెక్నిక్స్ ఉపయోగించడం ద్వారా మీరు సిబిల్ స్కోర్ ను సరిదిద్దుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం.

క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేయాలి:

చాలా మంది క్రెడిట్ కార్డులను వాడటం అనేది ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులను వాడే సమయంలో మీకు ఒక్కోసారి పెద్ద మొత్తంలో బిల్లులు అనేది వస్తుంది అప్పుడు అందులో మినిమం బిల్లును కట్టేసి మనం ఔట్ స్టాండింగ్ అమౌంట్ పే చేయకుండా వదిలేస్తూ ఉంటాము ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ అనేది దెబ్బతింటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ స్టాండింగ్ కట్టడానికే ప్రయత్నం చేయండి. అలా కట్టలేకపోతే దానిని మీరు ఈఎంఐ రూపంలో మార్చుకోవచ్చు. తద్వారా మీకు క్రెడిట్ స్కోర్ దెబ్బ తినకుండా ఉంటుంది.

పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ క్లియర్ చేసినప్పుడు వెంటనే ఎన్ఓసి తీసుకోండి..

కొన్నిసార్లు మీరు పర్సనల్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ తీసుకున్నప్పుడు అన్ని చెల్లింపులు పూర్తయినప్పటికీ అకౌంట్ క్లోజ్ గాక పోయినట్లయితే కొంత అమౌంట్ అనేది మిగిలిపోతుంది. మీరు దాన్ని పట్టించుకోకపోయినట్లయితే, మీ సిబిల్ స్కోర్ అనేది దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కనుక మీరు వెంటనే మీ లోన్ పూర్తవ్వగానే ఎన్వోసీ తీసుకోవడం మర్చిపోకూడదు.

లోన్ గ్యారంటీర్ గా ఉంటున్నారా అయితే జాగ్రత్త..

ఒక్కోసారి మీరు లోన్ గ్యారెంటీర్ గా ఉన్నట్లయితే, వెంటనే ఆ లోన్ వాయిదాలను సకాలంలో ఎవరైతే లోన్ పొందారో అతను కడుతున్నారా లేదా ఎప్పటికప్పుడు కనుక్కోండి. ఒకవేళ అతను వాయిదాలు చెల్లించకపోతే, మీ సిబిల్ స్కోర్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కనుక మీరు లోన్ గ్యారెంటీర్ గా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి.

చిన్నాచితక అవసరాలకు లోన్స్ తీసుకోవద్దు...

మీకు ఒక్కోసారి చిన్నాచితక అవసరాలకు తరచూ లోన్స్ తీసుకుంటూ ఉంటారు బ్యాంకులు కూడా కొన్నిసార్లు చిన్న మొత్తంలో లోన్స్ ఇచ్చేందుకు ఇష్టపడుతుంటాయి. అలాగే ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కూడా ఫైనాన్స్ పద్ధతిలో మీరు కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటి వాయిదాలను మీరు ఎప్పటికప్పుడు చెల్లిస్తేనే మంచిది. లేకపోతే మీరు సిబిల్ స్కోర్ నష్టపోయే ప్రమాదం ఉంది. మీ సిబిల్ స్కోర్ దెబ్బ తినకుండా లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే గోల్డ్ లోన్ తీసుకోవడం అనేది ఉత్తమమైన పరిష్కారం అని చెప్పవచ్చు.

Next Story