IDFC నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ విడుదల

by Harish |

దిశ, వెబ్‌డెస్క్ : ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నేడు తాము ఓపెన్‌ ఎండెడ్‌ ఇండెక్స్‌ పథకం ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది..Latest Telugu News

IDFC నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నేడు తాము ఓపెన్‌ ఎండెడ్‌ ఇండెక్స్‌ పథకం ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో 30 అత్యధిక కదలికలు కలిగిన భారీ మరియు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఉంటాయి. ఇవి నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30ఇండెక్స్‌ను ప్రతిబింబిస్తాయి. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ శుక్రవారం,ఆగస్టు 19,2022న తెరుస్తారు. శుక్రవారం, ఆగస్టు 26,2022న మూసివేస్తారు.

పెట్టుబడులను లైసెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు, ఎడ్వైజర్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌తో పాటుగా ఐడీఎఫ్‌సీ ఎంఎఫ్‌ వెబ్‌సైట్‌ https://idfcmf.com/idfc-nifty200-fund-nfo/ ద్వారా పెట్టవచ్చు.

తమ పోర్ట్‌ఫోలియోలో ఐడీఎఫ్‌సీ నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ను జోడించాల్సిన ఆవశ్యకతను గురించి ఐడీఎఫ్‌సీ ఏఎంసీ సీఈఓ విశాల్‌ కపూర్‌ మాట్లాడుతూ ''గత కొద్ది సంవత్సరాలుగా అత్యంత ప్రయోజనకరమైన వ్యూహంగా మూమెంటమ్‌ ఇన్వెస్టింగ్‌ నిరూపితమైంది. విస్తృత సూచీలలోనూ ఇది మెరుగ్గా ప్రదర్శన కనబరిచిందని అన్నారు''.

అలాగే ''200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఇప్పుడు నిఫ్టీ 100 మరియు నిఫ్టీ 200 సూచీలలోనూ గత 10 ఏళ్లలో ఎనిమిది సంవత్సరాలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుంది. ఇది సెక్యూరిటీలను వాటి ధర పెరుగుతున్నప్పుడు కొనుగోలు చేసే నిర్మాణాత్మక, పరిమాణాత్మక ప్రక్రియను అనుసరిస్తుంది. చారిత్రాత్మకంగా చూస్తే, మూమెంటం ఇండెక్స్‌ కోసం రిస్క్‌ యూనిట్‌ రిటర్న్స్‌ విస్తృత సూచికల కంటే ఎక్కువగా ఉన్నాయి. వైవిధ్యమైన పెట్టుబడి శైలి ద్వారా అందించే ఈ వైవిధ్యత స్మార్ట్‌, దీర్ఘకాలిక ఈక్విటీ మదుపరులకు ఆకర్షణీయమైనదిగా ఈ ఫండ్‌ను మారుస్తుంది'' అని అన్నారు.

Next Story