- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IDFC First Bank: హర్యానా ప్రభుత్వానికి రూ. 583 కోట్లు చెల్లించిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
ఆ సొమ్ము మొత్తాన్ని చెల్లించామని, ఈ మోసంలో భాగస్వామ్యం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌కు వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచులో రూ. 590 కోట్ల పెద్ద మొత్తం ఫ్రాడ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి బ్యాంకు మంగళవారం కీలక చర్యలు తీసుకుంది. హర్యానా ప్రభుత్వానికి ఆ సొమ్ము మొత్తాన్ని చెల్లించామని, ఈ మోసంలో భాగస్వామ్యం ఉన్న వారిపై, బకాయి మొత్తాన్ని రికవరీ చేయడంపై చర్యలు తీసుకుంటున్నామని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌కు వెల్లడించింది. ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ మంగళవారం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ హర్యానా ప్రభుత్వ సంబంధిత విభాగాలకు మొత్తం రూ.583 కోట్ల అసలు, వడ్డీ కలిపి చెల్లించింది. మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి, బకాయిలను తిరిగి పొందడానికి రాష్ట్ర అధికారులు, సంబంధిత సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు మెరుగైన నిర్వహణ, విలువలతో ప్రపంచస్థాయి బ్యాంకుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నాం. ఈ సంఘటనతో మరింత సమర్థవంతంగా పనిచేయడంపై దృష్టి సారిస్తామని బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకు ప్రకటనతో సోమవారం ట్రేడింగ్‌లో 16 శాతానికి పైగా క్షీణించిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు షేర్ ధర, తిరిగి రికవరీ సాధించి 1 శాతానికి పైగా లాభపడింది.






