- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IDFC First Bank: సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ తగ్గించిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
ఈ మార్పు దేశీయ, ఎన్ఆర్ఈ, ఎన్‌ఆర్‌ఓ సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త రేట్లు ఈ ఏడాది జనవరి 9 నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది. ఇదే సమయంలో కొత్త బ్యాలెన్స్ శ్లాబులను ప్రవేశపెట్టింది. ఈ మార్పు దేశీయ, ఎన్ఆర్ఈ, ఎన్‌ఆర్‌ఓ సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తుంది. అయితే, చాలావరకు మిడ్-సైజ్ బ్యాంకుల విభాగంలో తమ బ్యాంకుదే అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేట్లను అందిస్తున్నట్టు తెలిపింది. కొత్త రేట్ల ప్రకారం, రూ. లక్ష కంటే తక్కువ బ్యాలెన్స్‌లపై 3 శాతం వడ్డీ లభిస్తుంది(గతంలో ఇది రూ. 5 లక్షల వరకు వర్తించేది). కొత్తగా ఒక శ్లాబును జోడిస్తూ, రూ. 1 నుంచి రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్‌లపై 5 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 10 కోట్ల వరకు 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో, రూ. 5 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 7 శాతం వడ్డీ అందించేది. అనేక అధిక బ్యాలెన్స్‌ల కోసం వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి. రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకు డిపాజిట్లపై 6 శాతం, రూ. 25 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు 5 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ లభిస్తుంది. సేవింగ్స్ రేట్లను తగ్గించడం వల్ల ఇటీవల త్రైమాసికంలో క్షీణించిన తమ లాభాల మార్జిన్‌ను మెరుగుపరుచుకునేందుకు సహాయపడుతుందని బ్యాంక్ పేర్కొంది.






