- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IDFC First Bank: ఉద్యోగుల పెన్షన్ల జారీకి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుకు అనుమతులు
సీపీఏఓ, ప్రభుత్వం, బ్యాంకు మధ్య జరిగిన చర్చలు పూర్తవడంతో పెన్షన్ అందించేందుకు బ్యాంకు సిద్ధంగా ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (సీపీఏఓ) తరపున పెన్షన్‌లను పంపిణీ చేయడానికి తమకు అనుమతులు దక్కాయని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ బుధవారం ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం, బ్యాంకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు, మాజీ పార్లమెంటు సభ్యులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన అధికారులు ఐడీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా పెన్షన్లు తీసుకునేందుకు వీలుంటుంది. అయితే, రైల్వేలు, పోస్టాఫీసులు, టెలికాం, రక్షణ రంగాలకు చెందిన ఉద్యోగులను మినహాయించారు. ఆయా సంస్థల పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో నేరుగా తమ పెన్షన్‌ను పొందవచ్చని వివరించింది. సీపీఏఓ, ప్రభుత్వం, బ్యాంకు మధ్య జరిగిన చర్చలు పూర్తవడంతో పెన్షన్ అందించేందుకు బ్యాంకు సిద్ధంగా ఉంది. ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని బ్యాంక్‌కంట్రీ హెడ్ చిన్మయ్ ధోబ్లే చెప్పారు. పెన్షన్ తీసుకునే వారు తమ జీవిత భాగస్వామితో కలిసి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరవచ్చు. అనుకోని విధంగా పెన్షనర్ మరణించే, జీవిత భాగస్వామి అదే అకౌంట్ నుంచి ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వీలుంటుంది. కాగా, ప్రస్తుతం ఐడీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2.27 లక్షల కోట్ల విలువైన డిపాజిట్లను కలిగి ఉంది. బ్యాంకు రుణాలు, అడ్వాన్స్‌లు రూ. 2.31 లక్షల కోట్లుగా ఉన్నాయి.






