- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేటు చేతికి ‘ఐడీబీఐ’.. వాటా విక్రయానికి రంగం సిద్ధం
గత కొంతకాలంగా పెండింగులో ఉన్న ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కివచ్చేలా కనిపిస్తున్నది. బ్యాంకులో మెజారిటీ వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా పెండింగులో ఉన్న ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కివచ్చేలా కనిపిస్తున్నది. బ్యాంకులో మెజారిటీ వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దీనికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభమయ్యే అవకాశమున్నది. దాదాపు 7.1 బిలియన్ డాలర్ల (రూ. 63.88 వేల కోట్ల) విలువైన వాటాలను విక్రయించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది.
మెటార్జీ వాటా విక్రయం.. యాజమాన్య బదిలీ
ఐడీబీఐలో మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్‌ఐసీకి చెందిన 30.24 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం వాటాలున్నాయి. ఒప్పందం తర్వాత వాటా విక్రయంతో పాటు ఐడీబీఐ బ్యాంక్ యాజమాన్య హక్కులు కూడా బదిలీ అవుతాయి.
రేసులో దిగ్గజ సంస్థలు
ఐడీబీఐని దక్కించుకునేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇందులో సెంట్రల్ బ్యాంకు ఫిట్-అండ్-ప్రాపర్ ప్రమాణాలను తీర్చిన కోటక్ మహీంద్రా బ్యాంక్, మిడిల్ ఈస్ట్ కు చెందిన ఎమిరేట్స్ ఎన్‌బీడీ పీజేఎస్‌సీ, కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కంపెనీలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ చేసిన బిడ్డర్లు ప్రస్తుతం బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు, నష్టాలు, లోన్ బుక్స్, కార్యకలాపాలు, చట్టపరమైన సమస్యలను నిశితంగా పరిశీలించి తుది బిడ్ వేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇటీవల పార్లమెంట్ లో చెప్పారు. కాగా, 2026 మార్చి నాటికి వాటాల విక్రయాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.






