- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IDBI Bank: 2025-26లోపు ఐడీబీఐ వాటా అమ్మకం పూర్తయ్యే అవకాశం: దీపమ్ కార్యదర్శి
బిడ్డర్లు తమ సమీక్ష ప్రక్రియను దాదాపు పూర్తి చేశాయని, త్వరలో వాటా విక్రయ ప్రక్రియ ముగుస్తుందని ఆయన వెల్లడించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక విక్రయం పూర్తి చేస్తామని పెట్టుబడుల ఉపసంహరణ ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి అరుణిష్ చావ్లా తెలిపారు. గురువారం పరిశ్రమల సంఘం ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అర్హత కలిగిన బిడ్డర్లు తమ సమీక్ష ప్రక్రియను దాదాపు పూర్తి చేశాయని, త్వరలో వాటా విక్రయ ప్రక్రియ ముగుస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 47,000 కోట్ల ఆస్తుల మానిటైజేషన్ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే తొలి త్రైమాసికంలో రూ. 20,000 కోట్లను వసూలు చేసింది. అర్హత ఉన్న బిడ్డర్లు సమీక్ష ప్రక్రియను పూర్తి చేశాయి. ఐడీబీఐ వాటాకు సంబంధించి వారికున్న అన్ని ప్రశ్నలు, సందేహాలకు సమాధానం ఇచ్చినట్టు అరుణిష్ చావ్లా చెప్పారు. బిడ్డర్లకు అవసరమైన డేటా లేదా వివరాలు అందించామని, డాక్యుమెంట్లు కూడా సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని ఆశిస్తున్నామని, ఏడాది ఆఖరు నాటికి మిగిలిన పనులను పూర్తి చేయగలమని వెల్లడించారు. ఇదే సమయంలో బీమా దిగ్గజం ఎల్ఐసీలో మరికొంత వాటా అమ్మకం గురించి మాట్లాడిన అరుణిష్ చావ్లా.. దీపమ్, మర్చంట్ బ్యాంకర్లు, ఎల్ఐసీఎ కలిసి అంతర్గత బృందాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు.






