ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఐడీబీఐ బ్యాంక్!

by Disha Web Desk 16 |
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఐడీబీఐ బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఐడీబీఐ బ్యాంక్ వివిధ కాలపరిమితుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని, దీని ద్వారా ఎంపిక చేసిన కాలవ్యవధులపై అత్యధికంగా 6.55 శాతం వడ్డీని ఇవ్వనున్నట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు వివరాల ప్రకారం, 7 రోజుల నుంచి 20 ఏళ్ల కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై 2.70 శాతం నుంచి 5.30 శాతం వడ్డీ అందజేస్తోంది. ఎంపిక చేసిన ఏడాది కాలపరిమితి ఎఫ్‌డీపై అధికంగా 5.60 శాతం, ఐదేళ్ల కాలపరిమితిపై అధికంగా 5.8 శాతం వడ్డీ ఇవ్వనుంది.

సీనియర్ సిటిజన్లకు అన్ని కాలవ్యవధులపై సాధారణ ఖాతాదారుల కంటే అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీని అమలు చేస్తోంది. ఇదే సమయంలో ఇటీవల భారత స్వాంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు బ్యాంకులు ప్రారంభించిన ప్రత్యేక డిపాజిట్ ప్రయోజనాలను ఐడీబీఐ బ్యాంకు కూడా అందించనున్నట్టు వెల్లడించింది. దీనికోసం 'అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్' పేరుతో 500 రోజుల డిపాజిట్లపై అధికంగా 6.70 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది. కాగా, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ తగ్గిపోవడం, తక్కువ క్రెడిట్‌ను పెంచేందుకు బ్యాంకులు తమ డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఐడీబీఐ బ్యాంక్!


Next Story

Most Viewed