- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల జోరు.. Q4లో నికర లాభం రూ.14,755 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ నాలుగో త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. రూ.14,755 కోట్ల లాభంతో 9.28 శాతం వృద్ధి నమోదు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నాలుగో త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలానికి (Q4) బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 9.28 శాతం వృద్ధి చెంది రూ.14,755 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ లాభం రూ.13,502 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.55,595 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్యూ4లో ఇది రూ.47,442 కోట్లుగా ఉండేది. అయితే, బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 7.7 శాతం పెరిగి రూ.20,568 కోట్లుగా నమోదైంది. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్ నికర లాభం రూ.54,233 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది లాభం (రూ.48,591 కోట్లు) కంటే 11.6 శాతం ఎక్కువ కావడం విశేషం. అద్భుతమైన ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ బోర్డు తన వాటాదారులకు ప్రతి షేరుపై రూ.12 డివిడెండ్ ప్రకటించింది. అదేవిధంగా బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగుపడి గ్రాస్ ఎన్‌పీఏ (Gross NPA) 1.88 శాతం నుంచి 1.81 శాతానికి తగ్గింది.






