ICICI Bank: పొదుపు ఖాతాలపై వడ్డీ రేటులో కోత విధించిన ఐసీఐసీఐ బ్యాంక్

by S Gopi |
ICICI Bank: పొదుపు ఖాతాలపై వడ్డీ రేటులో కోత విధించిన ఐసీఐసీఐ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాలలో సొమ్ముపై వడ్డీ రేటును కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో అందుకనుగుణంగా బ్యాంకు వడ్డీ రేట్లను సవరించింది. సేవింగ్స్ ఖాతాల్లో సొమ్ముపై 0.25 శాతం వడ్డీని తగ్గించినట్టు బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బ్యాంకు పేర్కొంది. సవరించిన రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిటర్లు రూ. 50 లక్షల వరకు సేవింగ్స్ ఖాతాలో సొమ్ముపై 2.75 శాతం వడ్డీని పొందనున్నారు. రూ. 50 లక్షలకు పైగా ఉన్న మొత్తంపై 3.25 శాతానికి తగ్గించింది. ఇటీవల ఆర్‌బీఐ ప్రకటన తర్వాత ప్రైవేట్ రంగ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు యాక్సిస్ బ్యాంకులు కూడా తమ కస్టమర్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఐసీఐసీఐ బ్యాంకు అందిస్తున్న స్థాయిలో డిపాజిట్లపై వడ్డీని ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ సైతం రూ.10 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 2.7 శాతానికి, రూ.10 కోట్లు దాటిన సొమ్ముపై 3 శాతానికి వడ్డీని తగ్గించింది.

Next Story

Most Viewed