ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ. 769 కోట్ల జీఎస్టీ నోటీసులు

by S Gopi |

నోటీసుల్లో చెల్లించాల్సిన పన్నుతో పాటు జరిమానా, వడ్డీ కూడా కలిపి ఉందని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ. 769 కోట్ల జీఎస్టీ నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ భారీ పన్ను నోటీసులను అందుకుంది. తక్కువ జీఎస్టీ చెల్లించిన ఆరోపణలపై, పన్నుల అధికారులు తమకు రూ. 768.6 కోట్ల డిమాండ్ నోటీసు జారీ చేశారని ఐసీఐసీఐ బ్యాంక్ గురువారం ప్రకటనలో తెలిపింది. నోటీసుల్లో చెల్లించాల్సిన పన్నుతో పాటు జరిమానా, వడ్డీ కూడా కలిపి ఉందని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కస్టమర్లు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని కారణంగా విధించిన ఛార్జీలు, సంబంధిత సేవలపై బ్యాంక్ పూర్తి జీఎస్టీ చెల్లించలేదని పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికే ఇలాంటి సమస్యపై కోర్టుకు వెళ్లామని, ఈ నోటీసులపైనా న్యాయపరమైన మార్గాల ద్వారా సవాలు చేయనున్నట్లు తెలిపింది. నిర్దేశించిన సమయంలోగా అప్పీల్ దాఖలు చేయడంతో సహా తగిన చర్యలు తీసుకుంటామని బ్యాంక్ పేర్కొంది.

Next Story