- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Budget 2026పై ICAI కీలక సూచనలు.. కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా?
2026-27 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టేందుకు ఇంకా రెండ్రోజులే ఉన్నాయి. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్లో ఏయే రంగాలవారికి ఊరట లభిస్తుంది?

దిశ, వెబ్‌డెస్క్: 2026-27 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టేందుకు ఇంకా రెండ్రోజులే ఉన్నాయి. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్లో ఏయే రంగాలవారికి ఊరట లభిస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ విధానాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను సంస్కరణలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత చార్టెడ్ అకౌంటెంట్స్ సంస్థ (ICAI) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రీ-బడ్జెట్ మెమోరాండం ప్రాధాన్యం సంతరించుకుంది. పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించడం, న్యాయపోరాటాలు తగ్గించడం, స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సూచనలు రూపొందించామని ICAI తెలిపింది.
ఇవే ICAI ప్రధాన ఉద్దేశ్యాలు
2025 నవంబర్‌లో సమర్పించిన ఈ నివేదికలో ప్రత్యక్ష పన్నులు, అంతర్జాతీయ పన్నుల విధానం సహా అనేక అంశాలపై సిఫార్సులు ఉన్నాయి. ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనలను సులభతరం చేయడం, పన్ను ఎగ్గొట్టడాన్ని నియంత్రించడం, పన్ను వసూళ్ల సామర్థ్యాన్ని పెంచడం, పన్ను చెల్లింపుదారులకు అనవసరమైన ఇబ్బందులు తగ్గించడం ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశమని ICAI వెల్లడించింది. ఈ సందర్భంగా ICAI అధ్యక్షుడు చరణ్‌జోత్ సింగ్ నందా మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ICAI కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వానికి విశ్వసనీయ సలహాదారుగా కొనసాగుతోందని చెప్పారు. 2026–27 బడ్జెట్‌కు ఇచ్చిన సూచనలు వ్యాపార సౌలభ్యం పెంచేందుకు, స్థిరమైన వృద్ధిని సాధించేందుకు, పర్యావరణ హిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికే రూపొందించామని తెలిపారు.
వాటిపై ప్రభుత్వానికి కీలక సూచనలు
ICAI ప్రతిపాదనల్లో ముఖ్యంగా పన్ను సంబంధిత న్యాయపోరాటాలను తగ్గించడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. కొన్ని చిన్న తప్పిదాలపై క్రిమినల్ కేసులు పెట్టే విధానాన్ని తొలగించాలని, ఒకే తప్పుకు రెండుసార్లు జరిమానాలు విధించకుండా చూడాలని సూచించింది. అలాగే ఐటీ రిటర్న్ ప్రాసెసింగ్‌ను కేవలం లెక్కల పొరపాట్లు, స్పష్టమైన తప్పిదాల వరకే పరిమితం చేయాలని కోరింది. గతానికి వర్తించే నిబంధనల వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వానికి సూచించింది.
పన్ను చెల్లింపుదారులపై అనుసరణ భారం (Compliance Burden) తగ్గించేందుకు కూడా ICAI కీలక ప్రతిపాదనలు చేసింది. TDS, TCS, అడ్వాన్స్ ట్యాక్స్ వివరాలను ఒకే డిజిటల్ లెడ్జర్‌లో చూపించే విధానం తీసుకురావాలని సూచించింది. దీని ద్వారా పన్ను బకాయిలను సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చని తెలిపింది. విదేశీయులకు చెల్లింపులు చేసే సమయంలో చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ ఆధారంగా మాత్రమే పన్ను కట్ చేయాలని కూడా ప్రతిపాదించింది. అలాగే నాన్-రెసిడెంట్ వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేసే వారికి TAN (Tax Deduction and Collection Account Number) అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలని, స్క్రాప్ అమ్మకాలపై TCS తొలగించాలని ICAI సూచించింది. ఇవి వ్యాపారులపై అనవసరమైన భారాన్ని తగ్గిస్తాయని పేర్కొంది.
పన్ను వసూళ్లపై కీలక మార్పులు
పన్ను వసూళ్లు పెంచడం, ఎగ్గొట్టడాన్ని అడ్డుకోవడం కోసం కూడా కొన్ని కీలక మార్పులు సూచించింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్, స్పెక్యులేటివ్ బిజినెస్‌ను ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ పరిధిలోకి తీసుకురాకూడదని తెలిపింది. వివాహిత జంటలకు సంయుక్త పన్ను విధానం ప్రవేశపెట్టాలని, లాభాల ఆధారిత డిడక్షన్లకు తప్పనిసరిగా ఆడిట్ చేయాలని కూడా ప్రతిపాదించింది. వ్యవసాయ భూములు ఎక్కువగా కలిగి ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయాలని సూచించింది. దీని ద్వారా పన్ను పరిధిని విస్తరించవచ్చని ICAI అభిప్రాయపడింది.
ఇక ఆదాయ పన్ను చట్టాన్ని మరింత సులభతరం చేయాలని ICAI కోరింది. సర్‌చార్జ్ పరిమితిని పెంచాలని, కొత్త పన్ను విధానంలో కూడా ఆరోగ్య బీమా ప్రీమియం, వికలాంగ ఆధారితుల సంరక్షణ ఖర్చులపై డిడక్షన్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. గరిష్ట పన్ను రేటు లెక్కింపులో ఉపయోగించే సర్‌చార్జ్ రేట్లపై స్పష్టత ఇవ్వాలని, చిన్న ట్రస్టుల రిజిస్ట్రేషన్ల ఆటో రిన్యూవల్‌పై మార్గదర్శకాలు ఇవ్వాలని కోరింది. అడ్వాన్స్ రూలింగ్ దరఖాస్తులను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఒక నిర్దిష్ట గడువు ఉండాలని కూడా ICAI సూచించింది. దీని వల్ల వ్యాపారుల






