Online Fraud: ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఐ4సీ, అమెజాన్ ఇండియా ప్రత్యేక క్యాంపెయిన్

by S Gopi |

ఐ4సీ, అమెజాన్ సంయుక్తంగా రాబోయే నెలల్లో జాతీయ, ప్రాంతీయ స్థాయిలోనూ వరుస కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Online Fraud: ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఐ4సీ, అమెజాన్ ఇండియా ప్రత్యేక క్యాంపెయిన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాల ముప్పు నుంచి వినియోగదారులను రక్షించడానికి హోం వ్యవహారాల శాఖ, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ), అమెజాన్ ఇండియా ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా స్కామ్‌లకు సంబంధించి అట్టడుగు స్థాయి అవగాహన కల్పించడం, విద్య, సాంకేతికత ఆధారంగా అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో పనిచేయనున్నారు. క్యాంపెయిన్‌లో భాగంగా, ఐ4సీ, అమెజాన్ సంయుక్తంగా రాబోయే నెలల్లో జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రాంతీయ స్థాయిలోనూ వరుస కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో సంక్లిష్టమైన మోసపూరిత చర్యలను సులభంగా అర్థం చేసుకోగల చిట్కాలుగా చూపించే సోషల్ మీడియా కంటెంట్‌ను, అందరికీ చేరేలా అవసరమైన ఆన్‌లైన్ సలహాలతో కూడిన డిజిటల్ ప్రకటనలు రూపొందించనున్నారు. ఈ పండుగ సీజన్‌ సమయంలో చాలామంది షాపింగ్ చేస్తారు. వినియోగదారులను, ముఖ్యంగా మొదటిసారి ఇంటర్నెట్ వాడేవారు, సీనియర్ సిటిజన్‌లను మోసం చేసేందుకు స్కామర్‌లు ప్రయత్నిస్తారు. అమెజాన్‌తో భాగస్వామ్యం ద్వారా ఇలాంటి మోసాలను ఎలా గుర్తించాలో, వాటి బారిన పడకుండా ఎలా రక్షణ పొందాలో ఈ క్యాంపెయిన్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తుందని ఐ4సీ డైరెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.

Next Story