- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eternal: మాజీ ఉద్యోగులను తిరిగి కంపెనీలోకి రావాలని కోరిన జొమాటో ఫౌండర్ దీపీందర్ గోయల్
గతంలో తనతో పాటు పనిచేసిన కంపెనీ మాజీ ఉద్యోగులను తిరిగి ఎటర్నల్‌కు రావాలని కోరారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ఎటర్నల్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆ సంస్థ ఫౌండర్ దీపిందర్ గోయల్ తాజాగా అనూహ్య ప్రకటన ఒకటి చేశారు. గతంలో తనతో పాటు పనిచేసిన కంపెనీ మాజీ ఉద్యోగులను తిరిగి ఎటర్నల్‌కు రావాలని కోరారు. ఇది కొంత విచిత్రంగా ఉన్నప్పటికీ, ఒకప్పుడు కంపెనీయే స్వయంగా వెళ్లిపోవాలని కోరిన వారిని కూడా మళ్లీ రావాలని ఆహ్వానించారు. చాలా మంది ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టిన సమయంలో వారికి అవసరమైన 'వాతావరణం' లేదా 'లీడర్‌షిప్' జొమాటో అందించలేదని గోయల్ అభిప్రాయపడ్డారు. కానీ వారంతా జొమాటోలో ఉండటాన్ని ఇష్టపడ్డారని తనకు ఖచ్చితంగా తెలుసు, వారు కంపెనీని విడిచిపెట్టినప్పటి నుంచి మరెక్కడా జొమాటోలో ఉన్న అనువైన వాతావరణం లభించలేదని కూడా తనకు తెలుసునని గోయల్ అన్నారు. ప్రస్తుతం జొమాటో, బ్లింకిట్ క్విక్-కామర్స్, బ్లింకిట్ అంబులెన్సులు, డిస్ట్రిక్ట్, హైపర్‌ప్యూర్, నగెట్, ఫీడింగ్ ఇండియా వంటి వివిధ వ్యాపార రంగాలలో విస్తరిస్తున్న తరుణంలో దీపిందర్ గోయల్ ఈ రకమైన మెసేజ్ పంపించారు. ఇప్పుడున్న ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇది వారి కష్టం లేదా కంపెనీ ఎదుగుదల వల్ల కావొచ్చు, ఎటర్నల్ ఇప్పుడు వ్యవస్థీకృత స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మాజీ ఉద్యోగులు ఎలాంటి సంకోచం లేకుండా తిరిగొచ్చేందుకు వీలుందని మరవొద్దు. వెళ్లిన ఉద్యోగులందరూ మళ్లీ రావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.






