- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyundai Prices Hike: వినియోగదారులకు హ్యుందాయ్ బిగ్ షాక్.. జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంపు..!
దక్షిణ కొరియా(South Korea) చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్(Hyundai) అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా(South Korea) చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్(Hyundai) అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. దేశీయంగా విక్రయిస్తున్న అన్ని రకాల మోడళ్లపై రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు(Production Costs), లాజిస్టిక్ ఖర్చులు(Logistic Costs) పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
ప్రొడక్షన్ కాస్ట్ లు పెరగడంతో ఈ డెసిషన్ తీసుకున్నామని, దీంతో కొంత భారాన్ని వినియోగదారుల(Customers)కు బదిలీ చేస్తున్నామని హ్యుందాయ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) తరుణ్ గార్గ్(Tarun Garg) తెలిపారు. మోడల్ బట్టి ధరల పెంపు ఉంటుందని అన్నారు. హ్యుందాయ్ మోటార్ స్థానికంగా గ్రాండ్ ఐ10 నియోస్(Grand i10 Neos) నుంచి ఐయోనిక్ 5 ఈవీ(Ionic 5 EV) వరకు కార్లను సేల్ చేస్తుండగా.. వీటి ధరలు రూ. 5.92 లక్షల నుంచి రూ. 46.05 లక్షల వరకు ఉంది. కాగా ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్(Mercedes Benz), బీఎండబ్ల్యూ(BMW), ఆడి(Audi) సంస్థలు అన్ని వాహనాల ధరలను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ లో మరిన్ని కంపెనీలు కార్ల ధరలను పెంచే అవకాశం ఉంది.






