- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ola Electric: ఓలాలో వాటాలు విక్రయించిన హ్యూండాయ్, కియా
ఈ రెండు కంపెనీల అమ్మకం వాటా విలువ రూ. 689 కోట్లు కావడం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈవీ టూ-వీలర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌కు కష్టాలు వెన్నాడుతున్నాయి. గత కొంతకాలంగా సర్వీస్ విభాగంలో ఫిర్యాదులు, నియంత్రణా లోపాలు, అమ్మకాలు పడిపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొన్న ఓలాకు తాజాగా హ్యూండయ్ మోటార్, కియా సంస్థలు షాక్ ఇచ్చాయి. తాజాగా ఈ రెండు దిగ్గజ కార్ల తయారీ కంపెనీలకు ఓలా ఎలక్ట్రిక్‌లో వాటాలు ఉన్నాయి. ఆ వాటాను విక్రయించడంతో ఓలాకు ఇబ్బందులు తప్పేలా లేవు. హ్యూండాయ్ మోటార్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌లో తన మొత్తం వాటాను విక్రయించగా, దక్షిణ కొరియా కంపెనీ కియా తన హోల్డింగ్‌ను తగ్గించుకుంది. ఈ రెండు కంపెనీల అమ్మకం వాటా విలువ రూ. 689 కోట్లు కావడం గమనార్హం. హ్యూండాయ్ తన 2.47 శాతం వాటాను ఒక్కో షేర్‌కు రూ. 50.70 వద్ద మొత్తం అమ్మేయగా, కియా తనకున్న వాటాలో 0.6 శాతం ఓలా షేర్లను రూ. 50.55 వద్ద విక్రయించింది. కియాకు 1 శాతంలోపే వాటా ఉన్న కారణంగా ఎక్స్ఛేంజ్ డేటా ఇంకా ఎంత వాటా ఉందనే దానిపై వివరాలు ఇవ్వలేదు. ఈవీల అభివృద్ధి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సహకారం కోసం హ్యూండాయ్, కియా 2019లో ఒలా కంపెనీలో రూ. 2,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. రెండు దిగ్గజ వాటాదారులు ఓలా షేర్లను విక్రయించడంతో కంపెనీ షేర్‌పై బాగా ఒత్తిడి కనిపించింది. మంగళవారం ఓలా షేర్ ధర ఏకంగా 8 శాతం క్షీణించాయి. బుధవారానికి కనిష్టాల వద్ద కొనుగోళ్ల కారణంగా తిరిగి 1 శాతం ర్యాలీ చేసింది. గతేడాది ఆగష్టులో స్టాక్ మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చిన ఓలా షేర్లు ఇప్పటివరకు 46 శాతం క్షీణించాయి.






