- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyundai Motors: రూ. 1.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూండాయ్
ఏప్రిల్ నెల ఆఫర్ల కింద గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 నుంచి క్రెటా, వెర్నా, అల్కాజార్ వరకు కారు మోడల్, వేరియంట్‌ని బట్టి రూ. 1.10 లక్షల వరకు ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా భారీ ఆఫర్లను ప్రకటించింది. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఈవీ మోడళ్లపైనా అధిక ప్రయోజనాలు అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ నెల ఆఫర్ల కింద గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 నుంచి క్రెటా, వెర్నా, అల్కాజార్ వరకు కారు మోడల్, వేరియంట్‌ని బట్టి రూ. 1.10 లక్షల వరకు ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది. ఎక్స్ఛేంజ్‌పైనా రాయితీ ఇస్తున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. వీటిలో నగదు రాయితీతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్, స్క్రాపేజ్ సపోర్ట్, కార్పొరేట్ బెనెఫిట్స్, రూరల్ ఇన్సెంటివ్స్ లాంటి ప్రయోజనాలు ఉంటాయని హ్యూండాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది. వీటిలో అత్యంత ఆకర్షణీయంగా పాత-స్టాక్ హ్యుందాయ్ వెర్నాపై ఇప్పుడు మొత్తం రూ. 1.10 లక్షల వరకు డిస్కౌంట్, ఆ తర్వాత క్రెటా ఎలక్ట్రిక్‌పై రూ. 1 లక్ష వరకు తగ్గింపు లభిస్తుంది. ఎక్కువ ఆదరణ కలిగిన హ్యాచ్‌బ్యాక్ ఐ10 నియోస్‌పై రూ. 68 వేల వరకు, ఆరాపై రూ. 20 వేలు, ఐ20పై రూ. 58 వేలు, ఎక్స్‌టర్‌పై రూ. 43 వేలు, వెన్యూపై రూ. 5 వేల వరకు ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది.






