- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్‌కేకుల్లా హైదరాబాద్ ఇండ్లు.. ‘రియల్ బూమ్’తో 80 శాతం పెరిగిన వృద్ధి !
హాట్‌కేకుల్లా హైదరాబాద్ ఇండ్లు.. ‘రియల్ బూమ్’తో 80 శాతం పెరిగిన వృద్ధి !

దిశ, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. భవనాలు, లేఅవుట్ల అనుమతులు సహా ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లలో పెరుగుదలే దీనికి నిదర్శనం. గత కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. కొత్త నిర్మాణాలకు అనుమతుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగినట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మాములుగా హైదరాబాదులో సొంతిల్లు అంటే కొంత ఖరీదైన వ్యవహారంగా మారుతూ వస్తోంది. ఇదే సమయంలో అపార్ట్‌మెంట్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అపార్ట్ మెంట్స్ ధరలు రూ. 30 లక్షలు నుంచి 50 లక్షల రేంజ్ నుంచి ఏకంగా రూ. కోటి -1.50 కోట్లకు పైనే పలుకుతున్నాయి.
ఈస్ట్ ఆర్ వెస్ట్..
ఇటీవల గురుగ్రామ్‌కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్ డిన్ పోస్టులో.. హైదరాబాద్ నగరంలో 2020 నుంచి నివాస ఇళ్ల ధరలు అత్యధికంగా పెరిగాయని పేర్కొన్నారు. దేశంలోని ప్రాపర్టీ మార్కెట్లలో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రేట్లలో ఏకంగా 80 శాతం వృద్ధి కనిపించినట్టు తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ పోటీ పడుతూ ధరలు పెరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలి ప్రాంతాలతో పోలిస్తే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ధరలు తక్కువగానే పలుకుతున్నాయని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదుకు తూర్పున ఉన్న విజయవాడ హైవే, వరంగల్ హైవే వెళ్లే మార్గాల్లో ధరలు హైదరాబాదు పడమర ప్రాంతంతో పోలిస్తే చాలా తక్కువ పలుకుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాదులోని పశ్చిమంలో అంటే కోకాపేట, గచ్చిబౌలి, శంకర్ పల్లి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ ఒక ఇల్లు కొనుగోలు చేయాలంటే కోట్లు ఖర్చు చేయక తప్పదు.
ఎందుకీ డిమాండ్
*వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ, టెక్ పరిశ్రమ : చాలా పెద్ద, చిన్న సంస్థలు టెక్ రాజధానిగా హైదరాబాద్‌ను చూస్తున్నాయి. దీనివల్ల ఇక్కడే వ్యాపారాలను మొదలుపెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. కాబట్టి, రియల్ ఎస్టేట్ మార్కెట్, ముఖ్యంగా నివాస, వాణిజ్య భవనాల గృహ మార్కెట్‌కు కేంద్రంగా మారుతోంది.
*బలమైన మౌలిక సదుపాయాలు : నగరంలో ఓఆర్ఆర్, మెట్రోతో అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు రెండో దశ, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి కీలక ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇవి నగర ప్రకృతి దృశ్యాన్ని మారుస్తున్నాయి.
*సరసమైన ధరలు : బెంగళూరు, ముంబై వంటి ఇతర పెద్ద మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తిని కొనుగోలు చేయడం చాలా చౌక అనుకోవచ్చు. దీనివల్ల కొత్తగా నగరంలో సొంతిల్లు కావాలని ఆశించేవారికి, ఇప్పటికే నగరంలో ఉన్నవారి మళ్లీ పెట్టుబడులకు హైదరాబద్ ముఖ్యమైన ఎంపికగా ఉంది.
*గేటెడ్ కమ్యూనిటీ : ఇండిపెండెంట్, అపార్ట్‌మెంట్లతో పోలిస్తే గత కొన్నేళ్లలో గేటెడ్ కమ్యూనిటీల్లోని ప్లాట్లకు ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది. ఇది హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న ఆస్తులలో ఒకటిగా మారుతోంది. ఈ ప్లాట్లలో కనీస సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రత మెరుగ్గా ఉండటం ప్రధాన కారణం.
*నార్త్ సైడ్.. లగ్జరీ..
మరోవైపు విల్లాలు, డబుల్ బెడ్‌రూమ్, 5 బెడ్‌రూమ్ వంటి అనేక నివాస ఆస్తులకు డిమాండ్ పెరుగుతున్నందున ఉత్తర హైదరాబాద్ ప్రాంతం కొనుగోలుదారులకు 'సరసమైన లగ్జరీ'గా మారిందని క్రెడాయ్ హైదరాబాద్ కార్యదర్శి బి జగన్నాథ్ రావు అన్నారు. జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్‌లతో కూడిన ఈ ప్రాంతంలో ఏడాది కాలంలో అమ్మకాలు 179 శాతం పెరిగాయి. గతేడాది రూ. 1-2 కోట్ల మధ్య ఖరీదైన ఇళ్ల అమ్మకాలు 264 శాతం పెరిగాయి. అయితే రూ. 1 కంటే తక్కువ ధర ఉన్న ఆస్తులు 128 శాతమే పెరిగాయి. రూ. 2-5 కోట్ల వరకు ఉన్న ఇళ్ల అమ్మకాలు 157 శాతం పెరిగాయి. గతేడాది ప్రథమార్థంలో సగటున ఒక ఇంటి ఖరీదు అంతకుముందు ఏడాది ఉన్న రూ. 1 నుంచి 35 శాతం పెరగడం గమనార్హం.






