మైలేజీ 70 కి.మీ..రూ.10 వేల డౌన్ పేమెంట్‌..అదిరిపోయే బైక్ ఇదిగో !

by velandi.Saikiran |   (  Updated:2025-07-23 04:58:39  IST  )

మార్కెట్లోకి అనేక రకాల టూ వీలర్ వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా కొనుగోలు చేసే విధంగా కంపెనీలు...

మైలేజీ 70 కి.మీ..రూ.10 వేల డౌన్ పేమెంట్‌..అదిరిపోయే బైక్ ఇదిగో !
X

దిశ, వెబ్ డెస్క్ : మార్కెట్లోకి అనేక రకాల టూ వీలర్ వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా కొనుగోలు చేసే విధంగా కంపెనీలు... రకరకాల వాహనాలను తీసుకువస్తున్నాయి. అయితే హీరో కంపెనీ నుంచి ఎప్పుడో వచ్చిన స్ప్లెండర్ ప్లస్ బైక్ కు ( Hero Splendor) మాత్రం ఆదరణ తగ్గలేదు. ఈ బైక్స్.. తాజాగా రికార్డు స్థాయిలో అమ్ముడు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

గత నెలలో 3.31 లక్షల బైక్స్ సేల్ అయినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సామాన్యులు కొనుగోలు చేసే విధంగా ధర ఉండడం, మైలేజ్ ఎక్కువ ఇవ్వడం.. ఈఎంఐ ఆప్షన్ (EMI ) ఉన్న నేపథ్యంలో.. ఈ స్ప్లెండర్ ప్లస్ బైక్ సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ బైక్ కొనుగోలు చేయాలంటే 10,000 రూపాయల డౌన్ పేమెంట్ కడితే చాలని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఆ తర్వాత ప్రతినెల... EMI చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే.. ఈ స్ప్లెండర్ ప్లస్ బైక్ ఢిల్లీ ఎక్స్ షోరూం ధర 77,176 రూపాయలుగా ఉంది. ఈ ధర ఒక్కో షోరూంలో ఒక్కో తరహాలో ఉంటుంది. అలాగే ఈ బైక్ ఒక్కసారి లీటర్ కు 70 నుంచి 73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్థాయిలో.. తక్కువ బడ్జెట్ ఉన్న బైక్స్ మైలేజ్ ఇవ్వమన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ స్ప్లెండర్ ప్లస్ బైక్స్ సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Next Story