ఈ Smart TV లపై Amazon Festival Sales లో అదిరిపోయే Discounts

by Disha Web Desk 17 |
ఈ Smart TV లపై Amazon Festival Sales లో అదిరిపోయే Discounts
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబర్ 8 న ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ ఎత్తున తగ్గింపులు ఇవ్వనుంది. అయితే ముందస్తుగా కొన్ని ఆఫర్ల గురించిన వివరాలను కంపెనీ తన సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. వివిధ టాప్ కంపెనీల స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్లను అందించనున్నట్లు తన సైట్‌లో పేర్కొంది. శామ్‌సంగ్, వన్‌ప్లస్, సోనీ, LG , Xiaomi కంపెనీలకు చెందిన OLED, QLEDతో డిస్‌ప్లేలను కలిగిన స్మార్ట్‌టీవీలపై అమెజాన్ 60 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే కొనుగోలు సమయంలో SBI కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తుంది.

Redmi 43-అంగుళాల 4K అల్ట్రా HD టీవీ అసలు ధర రూ.42,999, కానీ ఈ సేల్‌లో రూ.20,499కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

Samsung Crystal 4K iSmart UHD TV అసలు ధర రూ.52,900. కానీ ఈ పండగ సేల్‌లో రూ.32,990కే కొనుగోలు చేయవచ్చు. దీనికి అదనంగా రూ.1,000 కూపన్ తగ్గింపు కూడా ఉంది.

OnePlus TV 43 Y1S ప్రో రూ. 26,999 కే లభిస్తుంది. దీని అసలు ధర రూ.39,999.

సోనీ బ్రావియా 65-అంగుళాల 4కె అల్ట్రా హెచ్‌డి టీవీ అసలు ధర రూ.1,39,900, కానీ ఇది రూ.82,990కే అందుబాటులో ఉంటుంది.

LG 50-అంగుళాల 4K అల్ట్రా HD TV ధర రూ. 40,990, దీని అసలు ధర రూ.60,990.

Vu 55-అంగుళాల మాస్టర్ పీస్ గ్లో QLED TV ప్రస్తుతం రూ. 62,999 (దీని అసలు ధర రూ.80,000), ఇంకా కూపన్ల ద్వారా రూ.3,000 తగ్గింపు ఉంది.

Acer 50-అంగుళాల V సిరీస్ 4K అల్ట్రా HD QLED TV తగ్గింపు ధరతో రూ.32,499 కే లభిస్తుంది. దీని అసలు రిటైల్ ధర రూ. 59,999.

TCL 40-అంగుళాల S సిరీస్ టీవీని అసలు ధర రూ.40,990, కానీ ఇది రూ.16,990కే లభిస్తుంది.

ఈ టీవీ మోడళ్లన్నింటిపై నో-కాస్ట్ EMI, ఎంపిక చేసిన వాటిపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఇంకా, Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్, ఇతర ఎంపిక చేసిన కార్డులపై క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి : రూ.28 వేలకే QLED TV.. అతి తక్కువ ధరలో రెండు స్మార్ట్‌టీవీలు



Next Story

Most Viewed