బ్లాక్ ఫ్రైడే సందర్భంగా Samsung భారీ తగ్గింపు

by Disha Web |
బ్లాక్ ఫ్రైడే సందర్భంగా Samsung భారీ తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సామ్‌సంగ్ కంపెనీ వినియోగదారుల కోసం ''బ్లాక్ ఫ్రైడే'' సందర్బంగా డిస్కౌంట్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ ఇండియాలో నవంబర్ 24న ప్రారంభమై నవంబర్ 28న ముగుస్తుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న బ్లాక్ ఫ్రైడే సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరకు అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా సామ్‌సంగ్ మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలపై తగ్గింపులతో పాటు, నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కొనుగోలు సమయంలో హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులపై తగ్గింపులు కూడా లభిస్తాయి.

Galaxy Z Flip 4 అసలు ధర రూ. 89,999, కానీ సేల్‌లో రూ. 80,999 కు లభిస్తుంది. అలాగే, Galaxy Z Flip 3 రూ. 67,999, Galaxy S21 FE 5G రూ. 40,000 లోపు, Galaxy F23 5G రూ. 14,000 లోపు, ఇంకా Samsung 65-అంగుళాల స్మార్ట్ TV, Galaxy Buds 2, Galaxy Watch 5, సౌండ్ బార్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు, టాబ్లెట్‌లు, ఎయిర్ కండిషనర్లు మొదలగు ఉత్పత్తులను భారీ తగ్గింపుతో బ్లాక్ ఫ్రైడే సేల్‌లో వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.

https://www.samsung.com/in/offer/online/samsung-fest/
Next Story

Most Viewed