- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: ప్రపంచంలోనే మొట్టమొదటి 10జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్‌ను ప్రారంభించిన చైనా
చైనా చేపట్టిన ప్రధాన మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ ఇంటర్నెట్ వేగాన్ని ఒక గిగాబిట్ నుంచి అనూహ్యంగా 10జీ స్థాయికి పెంచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: హువాయ్, చైనా యూనికామ్ సహకారంతో చైనా మొట్టమొదటి 10జీ ఇంటర్నెట్‌ను ప్రారంభించింది. బీజింగ్ సమీపంలో ఉన్న హెబీ ప్రావిన్స్‌లోని జియోంగాన్ న్యూ ఏరియాలో 10జీ స్టాండర్డ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను పరీక్షించగా, 9,800 ఎంబీపీఎస్(దాదాపు 10జీబీపీఎస్) కంటే ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ పనిచేసిందని మై-డ్రైవర్స్ తెలిపింది. అయితే, ఇక్కడ 'జీ' అంటే గిగాబిట్, జనరేషన్ కాదు. 10జీ బ్రాడ్‌బ్యాండ్ వాస్తవానికి ఫిక్స్‌డ్-లైన్ ఇంటర్నెట్.ఇది ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ల ద్వారా లభిస్తుంది. చైనా చేపట్టిన ప్రధాన మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ ద్వారా ఇంటర్నెట్ వేగాన్ని ఒక గిగాబిట్ నుంచి అనూహ్యంగా 10జీ స్థాయికి పెంచింది. ఫలితంగా ఇంటర్నెట్ సరఫరా అయ్యే సమయాన్ని కొన్ని మిల్లీసెకన్లకు తగ్గించింది. కొత్త 10జీ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ఉన్న ఒక ఇంట్లో ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ 9,834ఎంబీపీఎస్, అప్‌లోడ్ స్పీడ్ 1,008ఎంబీపీఎస్‌గా నమోదైంది. ఇది యూజర్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడంలో కొత్త అధునాతన టెక్నాలజీకి ఉన్న సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ 10జీ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించడం ద్వారా చైనా ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలలో అతిపెద్ద పురోగతిని సాధించింది. 8కె స్ట్రీమింగ్, ఏఆర్/వీఆర్, గేమింగ్, రిమోట్ వర్క్ వంటి అత్యధిక డేటా డిమాండ్ అవసరం ఉన్న ఇళ్లు, వ్యాపారాలకు ఇది బాగా సరిపోతుంది. ఈ అభివృద్ధి చైనా ప్రజల్లో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే, ఉపయోగించే విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే వేగవంతమైన, తక్కువ ఇబ్బందులతో ఇంటర్నెట్ లభిస్తుంది.






