- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HP India: మే నుంచి స్థానికంగానే ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లు తయారు చేయనున్న హెచ్‌పీ
ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ పీసీలు, ఆల్-ఇన్-వన్ సిస్టమ్‌లను స్థానిక ఉత్పత్తి మొదలవుతుందని కంపెనీ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ హెచ్‌పీ ఇండియా త్వరలో దేశీయంగా తయారీని ప్రారంభించనుంది. దీనికోసం కాంట్రాక్ట్ తయారీ కంపెనీ డిక్సన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మే నెల నుంచి హెచ్‌పీకి చెందిన ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ పీసీలు, ఆల్-ఇన్-వన్ సిస్టమ్‌లను స్థానిక ఉత్పత్తి మొదలవుతుందని మనీకంట్రోల్ తన కథనంలో పేర్కొంది. పూర్తిగా స్థానికత ద్వారా గతేడాది కంటే రెట్టింపు స్థాయిలో హెచ్‌పీ పరికరాల ఉత్పత్తి జరుగుతుందని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్, ఎండీ ఇప్సితా దాస్‌గుప్తా చెప్పారు. ఇటీవల భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ప్రకటించిన కొత్త దిగుమతి నిర్వహణ వ్యవస్థ గురించి ఉన్న ఆందోళనలను ప్రస్తావించిన దాస్‌గుప్తా.. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో దీనికి పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచ వాణిజ్య ఆందోళనల మధ్య గ్లోబల్ సరఫరాలో అవకాశాలను అందుకోవాలనుకుంటున్న భారత్ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయ ఉత్పత్తిలో కీల పాత్ర పోషించాలని, గణనీయమైన వాటా కలిగి ఉండాలని హెచ్‌పీ ఇండియా భావిస్తున్నట్టు ఆమె వివరించారు. ముఖ్యంగా బడా సంస్థలు, ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల నుంచి డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈలు, నాన్-మెట్రో ప్రాంతాల్లో హెచ్‌పీ పరికరాల అమ్మకాలు జరుగుతున్నాయి.






